వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ బంకులు 12 గంటలే తెరిచి ఉంటాయి, కారణమిదే!

ఈ ఏడాది మే 15వ, తేది నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకే పెట్రోల్ బంకులను తెరిచి ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఈ ఏడాది మే 15వ, తేది నుండి ఉదయం 6 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకే పెట్రోల్ బంకులను తెరిచి ఉంచుతామని ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ అధ్యక్షుడు గోపాలకృష్ణ చెప్పారు.

తమ డిమాండ్ల సాధన కోసం మే 15 నుండి 12 గంటలపాటే బంకులను నిర్వహించనున్నట్టు ఆయన ప్రకటించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరినా మీనమేషాలు లెక్కిస్తోందని ఆయన చెప్పారు.

మే 10న, అన్ని చములురు కంపెనీల నుండి పెట్రోల్ ,డీజీలు కొనుగోళ్ళను నిలిపివేయనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్టుగానే ఇంధన పొదుపులో భాగంగా మే 14వ, తేదిన బంకులను పూర్తిగా మూసివేస్తామని ప్రకటించారు.

petrol bunks will be working 12 hours from May 15:Gopalakrishna

పెట్రోల్ లీటరుకు రూ.3.33, డీజీల్ కు రూ.2.30 చొప్పు కమీషన్ ఉంటే కానీ, బంకులు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. గత మార్చి నెలలో సమ్మె చేసిన సమయంలో కమీషన్లు పెంచుతామని లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ రూ.2.59, డీజీల్ కు రూ.1.63 కమీషన్ ను చెల్లిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

2011లో అపూర్వచంద్ర కమిటీ ఇచ్చిన సిఫారసులను పట్టించుకోకుండా విచ్చలవిడిగా కొత్త బంకులకు అనుమతులను మంజూరుచేస్తున్నారని చెప్పారు. ఆ కమిటీ సిఫారసుల మేరకు కమీషన్లు కూడ పెంచలేదన్నారు. అపూర్వ కమిటీ సిఫారసుల మేరకు నెలకు 1.70 లక్షల కిలోలీటర్ల విక్రయిస్తే కానీ, బంకుల నిర్వహణ సాధ్యం కాదన్నారు. ప్రస్తుతం సగటున నెలకు 1.40 లక్షల కిలోలీటర్లకు మించి విక్రయాలు జరగడం లేదన్నారు.

English summary
petrol bunks will be working 12 hours from May 15 said Ap fedaration of petrolium traders president gopalakrishna on Tuesday at Vijayawada. Union governament didn't accept our demands he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X