వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వద్దని చెప్పా: చీపురు పట్టిన బాబు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం విశాఖపట్నంలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రెండోవిడత జన్మభూమి ముగింపు సభను సోమవారం విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చినందుకు తాను గర్వపడుతున్నానన్నారు.

ప్రజల కోసం తాను పనిచేస్తానని, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సహకరించాలన్నారు. ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటానన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రెండోవిడత జన్మభూమి ముగింపు సభను సోమవారం విశాఖ జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉద్యోగులకు హెల్త్‌కార్డులు ఇచ్చినందుకు తాను గర్వపడుతున్నానన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

ప్రజల కోసం తాను పనిచేస్తానని, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సహకరించాలన్నారు. ఉద్యోగులను అన్ని విధాలా ఆదుకుంటానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, మహిళా సంఘాలు వడ్డీలు చెల్లించడం మానేశాయని చంద్రబాబు అన్నారు. అయితే కొంతమంది వడ్డీ చెల్లించారన్నారు.

 చంద్రబాబు

చంద్రబాబు

వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఇప్పటికే చెల్లించిన వడ్డీని కూడా ప్రభుత్వం తిరిగి సంఘాలకు చెల్లిస్తుందని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

గత ప్రభుత్వాలు మహిళలను అప్పులపాలు చేస్తే, తాను వారికి ఆర్థిక ఆసరా కల్పించానన్నారు. రైతుల రుణ మాఫీపై ఈనెల 20న ప్రకటన చేస్తానని చంద్రబాబు తెలిపారు.

 చంద్రబాబు

చంద్రబాబు

హుధుద్ తుపానులో నష్టపోయిన రైతులకు ఎకరాకు లక్షా 50 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు కేంద్రం సహకరిస్తోందని, ప్రాజెక్ట్ పనులు పూర్తయితే, ఉత్తరాంధ్రలో పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

రాష్ట్రంలోని 13 వేల పంచాయతీల సర్వతోముఖాభివృద్ధికి 1300 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చంద్రబాబు చెప్పారు. ఒక్కో పంచాయతీకి 10 కోట్ల వస్తుందని, దానికి ఆయా పంచాయతీలు మరో 20 కోట్లు జోడించి గ్రామాభివృద్ధికి వినియోగించాలని కోరారు.

చంద్రబాబు

చంద్రబాబు

10 కోట్ల రూపాయలు సక్రమంగా ఖర్చు చేయకుంటే, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుటానని హెచ్చరించారు. ప్రతిఒక్క గ్రామాన్ని ఆదర్శ, స్వఛ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు.

 చంద్రబాబు

చంద్రబాబు

విశాఖ నగరాన్ని దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. విశాఖ జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ కంపెనీలు ముందుకు వస్తున్నాయని, అందుకు అనుగుణంగా విశాఖ నుంచి దేశంలోని ముఖ్య నగరాలకు విమాన సర్వీసులు నడిపేవిధంగా ఇండిగో విమానయాన సంస్థతో చర్చించినట్టు ముఖ్యమంత్రి తెలియచేశారు.

చంద్రబాబు

చంద్రబాబు

దేశంలోనే తొలి ఇండిగో హబ్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కాగా, ఆయన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

English summary
Photos: AP CM CHANDRABABU PARTICIPATES IN JANAMABHUMI PROGRAMME
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X