నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'డాక్టర్' హల్‌చల్: ఎత్తుకున్న రాజయ్య, కవిత (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: జూనియర్‌ డాక్టర్లను రెగ్యులర్‌ ఉద్యోగాల్లో నియమించేందుకు ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, వారు తక్షణం సమ్మె విరమించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ రాజయ్య కోరారు. నిజామాబాద్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జూనియర్‌ డాక్టర్లందరూ విద్యార్థులేనని వారు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతాల్లో పని చేయాల్సిందేనన్నారు.

ప్రస్తుతం ఉద్యోగాలపై బ్యాన్‌ ఉన్నందున భర్తీ చేయలేమన్నారు. జూనియర్‌ డాక్టర్ల అంశం కోర్టులో ఉన్నందున, కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని రాజయ్య తెలిపారు. ఇప్పటికే వారితో రెండు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపిందన్నారు. వారి వెనుక కొన్ని అదృశ్య శక్తులు ఉండి సమ్మె చేయిస్తున్నాయన్నారు. బుధవారం రాజయ్య అదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లో పర్యటించారు.

రాజయ్య

రాజయ్య

బుధవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ రాజయ్య అదిలాబాద్, నిజమాబాద్ జిల్లాల్లో పర్యటించారు.

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. ఓ చిన్నారిని ఎత్తుకున్న కవిత, రాజయ్య

రాజయ్య

రాజయ్య

ప్రభుత్వ ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ తాటికొండ రాజయ్య స్పష్టం చేశారు.

రాజయ్య

రాజయ్య

వైద్య ఆరోగ్యశాఖను ప్రక్షాళన చేస్తామన్నారు. అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రులను మరింత మెరుగుపరుస్తామని, అన్ని రకాల సేవలను పేదలకు అందిస్తామన్నారు.

రాజయ్య

రాజయ్య

అన్ని పీహెచ్‌సీల్లో పేదలకు వై ద్యసేవలు అందించాలని ఎంపీ కవిత అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉందని ఆమె అన్నారు.

రాజయ్య

రాజయ్య

వివిధ రకాల వ్యాధులతో నిజామాబాద్ జిల్లాలో రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఇతర జిల్లాలతో పోల్చుకుంటే కొంత వరకు సేవలు అందినా అదే సరిపోదని కవిత అన్నారు. వైద్యులు 24 గంటలు ఆసుపత్రులలో ఉండి రోగులకు సేవలు అందించాలన్నారు.

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. ఓ రోగిని పరామర్శిస్తూ..

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. ఓ రోగిని పరిశీలిస్తున్న రాజయ్య.

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. ఓ చిన్నారిని పరిశీలిస్తున్న రాజయ్య.

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. ఆసుపత్రిలో కవిత, రాజయ్య.

రాజయ్య

రాజయ్య

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్ రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు. వైద్యులతో మాట్లాడుతున్న రాజయ్య.

రాజయ్య

రాజయ్య

అన్ని పీహెచ్‌సీల్లో పేదలకు వై ద్యసేవలు అందించాలని ఎంపీ కవిత అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సిద్దంగా ఉందని ఆమె అన్నారు.

జూడాల ఐదుడిమాండ్లలో నాలుగింటిని తాము అంగీకరించామన్నారు. అయితే, ఏడాది గ్రామీణ సర్వీసు పేరిట ఉన్న నిబంధనను కాదని రెగ్యులర్‌గా పరిగణించాలని కోరటం ఎంత వరకు సమంజసమన్నారు. జర్నలిస్టులకు త్వరలో ఆరోగ్య కార్డులు ఇస్తామన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ఆసుపత్రిలో రాజయ్య పరామర్శించారు. ఆయన వెంట ఎంపీ కవిత ఉన్నారు.

English summary
Photos of Deputy CM Rajaiah Programme in Nizamabad, Adilabad districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X