వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో చిరంజీవి ఇలా, మమత జోలికి రావొద్దని మోడీకి హెచ్చరిక (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు గురువారం ఉదయం విపక్షాల నిరసనల మధ్య ప్రారంభమయ్యాయి. విపక్షాలు నినాదులు చేయవద్దని లోకసభలో సభాపతి, రాజ్యసభలో వైస్ చైర్మన్ విపక్షాలకు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.

శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.

మరోవైపు, విదేశాల్లోని నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు విరుచుకుపడ్డారు. నల్ల శాలువాలు కప్పుకుని వచ్చి పార్లమెంట్‌ ఆవరణలో నిరసన తెలిపారు.

హామీ మేరకు నల్లధనం వెనక్కి తేనందుకు మోడీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బెంగాల్‌ ముఖ్యమంత్రి, తమ పార్టీ అధినేత్రి మమత బెనర్జీ జోలికి వస్తే సహించేది లేదని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీలు హెచ్చరించారు.

చిరంజీవి

చిరంజీవి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి గురువారం నాడు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు.

టీఎంసీ

టీఎంసీ

నల్ల ధనంపై తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోకసభలో వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. తొలి రోజు నల్ల గొడుగులతో ఆందోళన వ్యక్తం చేసిన సభ్యులు, గురువారం నల్ల శాలువాలు కప్పుకుని వచ్చి తమ నిరసన తెలిపారు.

కేంద్రమంత్రితో కాంగ్రెస్ నేత

కేంద్రమంత్రితో కాంగ్రెస్ నేత

కేంద్రమంత్రి రాజ్ బీరేంద్ర సింగ్‌తో చేయి కలుపుతున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఆనంద్ శర్మ. ఎంపీ కుమారి సెల్జా వారిని చూస్తున్న దృశ్యం.

అరుణ్ జైట్లీ

అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు అరుణ్ జైట్లీ గురువారం నాడు పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరయ్యారు.

శ్రీధరన్

శ్రీధరన్

మెట్రో మ్యాన్ ఈ శ్రీధరన్ పార్లమెంటు భవనం ఎదుట. శీతాకాల పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

కాంగ్రెస్ సభ్యులు

కాంగ్రెస్ సభ్యులు

శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తాకర రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు.

టీఎంసీ

టీఎంసీ

గురువారం సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. వెంటనే నల్ల శాలువాలు ధరించిన తృణమూల్ సభ్యులు సభలోకి ప్రవేశించారు. 'నల్లధనం వెనక్కి తీసుకురావాలి' అంటూ నినాదాలు చేస్తూ వారి సీట్లలోకి వెళ్లారు.

కాంగ్రెస్

కాంగ్రెస్

శంషాబాద్ విమానాశ్రయ డొమెస్టిక్ టెర్మినల్‌కు స్వర్గీయ నందమూరి తాకర రామారావు పేరు పెట్టడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ సభ్యులు.

English summary
Photos of Opposition Asks Modi to Apologise for Failing to Bring Back Black Money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X