వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ఆఫీస్‌లో సానియా, సెక్రటరియేట్లో బాబు(పిక్చర్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా బుధవారం మధ్యాహ్నం క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఇటీవల సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తగా ఉన్నారు.

అంతకుముందు, అంతర్జాతీయ ప్రీమియర్‌ టెన్నిస్‌ లీగ్‌ (ఐపీటీఎల్‌)లో స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ పెదరర్ జట్టులో తాను కూడా ఉండడం ఎంతో థ్రిల్లింగ్‌గా ఉందని సానియా చెప్పారు. అంతర్జాతీయ స్థాయి దిగ్గజ ఆటగాళ్లు ఐపీటీఎల్‌లో ఆడడం భారత్‌ లాంటి దేశాల్లో టెన్నిస్‌ అభివృద్ధికి దోహదపడుతుందని బుధవారం చెప్పారు.

ఐపీటీఎల్‌ తప్పకుండా సక్సెస్‌ అవుతుందన్నారు. వచ్చే నెల ఆరంభంకానున్న ఐపీటీఎల్‌లో భారత్‌తో కలిపి మొత్తం నాలుగు ప్రాంఛైజీలున్నాయి. ఈ టోర్నీలో ఫెడరర్‌, జొకోవిచ్‌, ఆండీ మర్రే, పీట్‌ సంప్రాస్‌ లాంటి ఆటగాళ్లు ఆడనున్నారు. భారత్‌లో టెన్నిస్‌ పట్ల ఆకర్షణ పెరుగుతోందని, ఎంతో ప్రతిభ ఉన్న యువ ఆటగాళ్లు వెలుగుచూస్తున్నారన్నారు.

మరోవైపు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం నాడు హుధుద్ తుఫాను, తదనంతర పరిణామాల పైన సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులతో ఆయన మాట్లాడారు.

కేసీఆర్ - సానియా మీర్జా

కేసీఆర్ - సానియా మీర్జా

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ప్రముఖ టెన్నిస్ తార సానియా మీర్జా బుధవారం మధ్యాహ్నం క్యాంప్ ఆఫీసులో కలిశారు.

కేసీఆర్ - సానియా మీర్జా

కేసీఆర్ - సానియా మీర్జా

ఇటీవల సానియా డబ్ల్యూటీఏను గెలుచుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ వచ్చిన ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రిని కలిశారు. ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రచారకర్తగా ఉన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

మీ ముఖాల్లో తిరిగి ఆనందం చూశా..ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడం వలన తుపాను సమయంలో ప్రాణ నష్టాన్ని నివారించగలిగాం.. స్థానిక నాయకత్వం, జిల్లా యంత్రాంగం కష్టపడి పనిచేశారు..మీలో మనో ధైర్యం కలిగించారు.. బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తాను అంటూ ఏపీ సీఎం చంద్రబాబు హుధుద్ బాధితులకు భరోసా ఇచ్చారు. బుధవారం రాత్రి విశాఖపట్నంలోని ఎంవిపి కాలనీ, విజయనగరం జిల్లాలో గోవిందపురం, శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం ప్రాంతాలకు చెందిన వారితో ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా ముఖాముఖీ సంభాషించారు.

చంద్రబాబు

చంద్రబాబు

ఈ సందర్భంగా అందరూ ప్రభుత్వ పనితీరును మెచ్చుకున్నారు. ఇంత తొందరగా మంచినీళ్లు, విద్యుత్ సరఫరా జరగడం ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన సరకులు అందాయన్నారు. ఈ సందర్భంగా బాధితుల నుంచి కష్ట సుఖాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మత్స్యకారులకు ఇళ్లు నిర్మించడానికి అనేక సంస్థలు ముందుకు వచ్చాయన్నారు. తుపాను సమయాల్లో ఎటువంటి నష్టం కలుగని విధంగా ఉత్తరాంధ్రలో 30 నుంచి 50 కాలనీలు నిర్మిస్తామన్నారు. తుపాను వల్ల పెద్ద ఎత్తున కోళ్ల పరిశ్రమకు నష్టం వాటిల్లిందన్నారు. లేయర్లకు రూ.150, బ్రాయిలర్‌కు రూ.75 కింద పదివేల కోళ్లకు ఆర్థిక సాయం అందించనున్నామన్నారు. సరగుడు చెట్లకు హెక్టారుకు రూ.12500, టేకు చెట్లకు, ఇతర వాటికి నష్టపరిహారం అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తయారు చేసిన జాబితాలో తమ పేర్లు లేకుంటే తమకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు.

English summary
Photos of Sania Mirza Meet KCR at Camp Office on won the BNP Paribas WTA Finals, Singapore doubles Title.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X