హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒకే ఒక్కడు: 'అతడు' స్ఫూర్తిగా దొంగగా టెక్కీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓ బీటెక్ విద్యార్థి ఉద్యోగం కోసం నగరానికి వచ్చి ఓ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని దొంగగా మారాడు. 38 చోరీల అనంతరం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు పోలీసులు అతనిని పట్టుకున్నారు. మాదాపూర్ అదనపు డీసీపీ శ్రీనివాస్, ఇన్స్‌పెక్టర్ శ్రీకాంత్ గౌడ్‌లు ఈ వివరాలు తెలిపారు.

అనంతపురం పట్టణానికి చెందిన మేళ్ల శీనయ్య సుందర్ వయస్సు 28. అతను బీటెక్(ఈసీఈ) పూర్తి చేసి ఉద్యోగం నిమిత్తం రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చాడు. కేపీహెచ్‌బీ కాలనీలోని తన బంధువుల ఇంట్లో కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం అమీర్ పేటకు వచ్చాడు.

ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అంతేకాక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఖర్చుల కోసం దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అతడు సినిమా చూసి బోల్ట్ కట్టర్ ద్వారా ఇళ్ల తాళాలు కట్ చేసే విధానాన్ని ఎంచుకొని, దొంగతనాలు చేశాడు.

 బీటెక్ విద్యార్థి దొంగతనం

బీటెక్ విద్యార్థి దొంగతనం

ఏడాదిన్నర క్రితం దొంగతనాలు ప్రారంభించిన మేళ్ల శీనయ్య సుందర్ ముప్పై అయిదు ఇళ్లలో దొంగతనాలు, 3 సాధారణ చోరీలు చేశాడు.

 బీటెక్ విద్యార్థి దొంగతనం

బీటెక్ విద్యార్థి దొంగతనం

ఎక్కువగా ల్యాప్‌టాప్‌లను ఎత్తుకు వెళ్లేవాడు. అతడు ఒక్కడే నేరాలకు పాల్పడుతుండటంతో ఇన్నాళ్లు పోలీసులకు పట్టుబడలేదు.

 బీటెక్ విద్యార్థి దొంగతనం

బీటెక్ విద్యార్థి దొంగతనం

గురువారం సాయంత్రం కేబీహెచ్‌బీ ధనలక్ష్మి కూడలిలో అనుమానాస్పతంగా తిరుగుతున్నాడు. అతనిని పెట్రోలింగ్ పోలీసులు అనుమానించి, పట్టుకున్నారు.

 బీటెక్ విద్యార్థి దొంగతనం

బీటెక్ విద్యార్థి దొంగతనం

అతడి సంచిలో ల్యాప్‌టాప్‌లతో పాటు బోల్ట్ కట్టర్‌లు దొరికాయి. అతనిని పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చి విచారించారు. అతడి వద్ద నుండి రూ.27 లక్షళ విలువైన 472 గ్రాముల బంగారు, 443 గ్రాముల వెండి ఆభరణాలు, 59 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు.

English summary
An engineering graduate turned thief was arrested by the police on Friday. The accused Mella Seenaiah Sundar, 28, came to the city in search of work, but took to crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X