వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ ట్విస్ట్: షాకైన తలసాని, బాబుని దులిపి(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ గంగాధర్‌లు బుధవారం సాయంత్రం తెరాసలో చేరారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సహా అందరు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పైన దుమ్మెత్తి పోశారు. తెలంగాణను చంద్రబాబు ఇబ్బంది పెడుతున్నారని, కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. హైదరాబాదులోని ఆంధ్రా వాళ్లు తమ బిడ్డలేనని, ఆంధ్రా పారిశ్రామికవేత్తలకు తాము ఎర్రతివాచీ పరుస్తామని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో చలన చిత్ర పరిశ్రమని ప్రోత్సహిస్తామని, హాలీవుడ్ నిర్మాతలే ఇక్కడకి వచ్చి చిత్రాలు నిర్మించుకునేలా ఫిలిం సిటీని నిర్మిస్తామని, చంద్రబాబు అమలు కానీ హామీలు ఇచ్చారని, వచ్చే నాలుగేళ్లలో ప్రతి ఇంటికి నీటి కనెక్షన్ ఇవ్వకుంటే తాము మళ్లీ ఓట్లు అడగమని కేసీఆర్ అన్నారు. బాబు గురించి మాట్లాడమంటే సమయం వృథా చేసుకోవడం అంటూనే కేసీఆర్ విమర్శలు గుప్పించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

తెలంగాణ అభివృద్ధికి అన్ని వర్గాల సహకారం తీసుకుంటామని, దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారంతా తెలంగాణవారేనని, ముఖ్యంగా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా ప్రాంత వాసులంతా నా బిడ్డలేనని, వారిని నా కన్నబిడ్డల్లా చూసుకుంటామని, వారి సంక్షేమాన్ని కూడా మేం పట్టించుకుంటామని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

ఆంధ్రానుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తామని చెప్పారు. వారిని బాధపెట్టడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రావాళ్లంతా తెలంగాణ వాళ్లేనని చెప్పారు. తెలంగాణపై తనకు కొన్ని కలలు ఉన్నాయని, వాటిని వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నానని చెప్పారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

మీర్‌పేటలోని టీకేఆర్‌ కళాశాల ఆవరణలో బుధవారం జరిగిన భారీ సభలో టీడీపీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, తలసాని
శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ తదితరులు కేసీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

చంద్రబాబు గురించి ఎక్కువగా మాట్లాడనని అంటూనే కేసీఆర్‌ ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నేను జగమొండినని, తెలంగాణ కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొందని, ప్రత్యేక రాష్ట్రంలో మేం ఇంకా గోచీ సర్దుకోకముందే టీడీపీ, కాంగ్రెస్‌లు విమర్శల దాడులు చేస్తున్నాయన్నారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

తెలంగాణను దోచుకునేందుకు ఆంధ్రా పార్టీల నాయకులు ఇంకా కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఉద్దేశించి ధ్వజమెత్తారు. లక్షమంది చంద్రబాబులు వచ్చినా తెలంగాణను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

తెలంగాణపై దురుద్దేశపూర్వకంగా టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణలో కరెంటు పాపం పదేళ్లు పాలించిన కాంగ్రెస్‌, తొమ్మిదేళ్లు పాలించిన టీడీపీలదేనని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిందని, అప్పుడే టీడీపీ, కాంగ్రెస్‌ నాయకులు విద్యుత్‌ సమస్య అంటూ ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

చంద్రబాబు తెలంగాణలోని తన తొత్తులతో ఆందోళనలు చేయించి తమను బద్‌నామ్‌ చేయించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేవలం అధికారం కోసమే చంద్రబాబు ఎన్నికల్లో లక్ష కోట్ల రైతుల రుణాలతోపాటు డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వాగ్దానం చేశారని, కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని నిలుపుకోలేకపోయారని, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ వాగ్దానాన్ని నిలుపుకోవాలని చంద్రబాబుకు కేసీఆర్‌ సవాల్‌ విసిరారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

ఆంధ్రా వలసవాదుల పాలన అంతా దుర్మార్గమైనదని కేసీఆర్‌ ఆరోపించారు. క్రమశిక్షణ, ప్రణాళిక ప్రకారం పాలన సాగలేదని తప్పుబట్టారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

హైదరాబాద్‌లో పెద్ద మొత్తంలో భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిని మళ్లీ వెనక్కి తీసుకుని పేదల సంక్షేమం కోసం వినియోగిస్తామని చెప్పారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

‘‘హైదరాబాద్‌ నగరాన్ని తాను అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటున్నాడు. ఇప్పుడు కుతుబ్‌ షా బతికి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. జల్లు పడితే చాలు.. సీఎం ఇంటి ముందు, గవర్నర్‌ బంగళా ముందు, అసెంబ్లీ ముందు జలాశయాలు ఏర్పడతాయి'' అని ఎద్దేవా చేశారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

నగర రోడ్లను అమెరికా, లండన్‌ రోడ్ల మాదిరిగా రూపుదిద్దుతామని ప్రకటించారు. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి నీటి సమస్య లేకుండా చేస్తానని, ఒకవేళ ఆ పని చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని కేసీఆర్‌ ప్రకటించారు. హైదరాబాద్‌ త్వరలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి కాబోతోందన్నారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

హైదరాబాద్‌ నగరాన్ని చారిత్రక నగరంగా తీర్చిదిద్దుతామని, ముఖ్యంగా పాతబస్తీని ఇస్తాంబుల్‌ మాదిరిగా రూపుదిద్దుతామని ప్రకటించారు.

 తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

ఇందుకు కొందరు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలతో కూడిన ప్రతినిధి బృందాన్ని త్వరలో ఇస్తాంబుల్‌కు పంపిస్తామని చెప్పారు. హైదరాబాద్‌ను మురికివాడలు లేని నగరంగా తీర్చిదిద్దుతామని, ఇందుకు రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

నగరంలోని 1700 మురికివాడల్లోని ప్రజలకు ఎక్కడ ఉన్నవారికి అక్కడ పట్టాలు రెగ్యులరైజేషన్‌ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

హైదరాబాద్‌లో పేకాట క్లబ్బులను నడవనిచ్చేది లేదని, వాటిని మూసివేశామని తెలిపారు. వాటిలో అధికశాతం ఆంధ్రా వాళ్లవే ఉన్నాయని, వాటిని మూసేస్తే ఆంధ్రోళ్లే బాధ పడుతున్నారని చెప్పారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

నగరంలోని చంచల్‌గూడ జైలు, రేస్‌ కోర్స్‌లను తరలిస్తామని, వాటి స్థానాల్లో విద్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. అలాగే, సినీరంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెబుతూ.. రెండు వేల ఎకరాలతో ఫిల్మ్‌ సిటీని నిర్మిస్తామని, అవసరమైతే మరో వెయ్యి ఎకరాలను కూడా కేటాయిస్తామని ప్రకటించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

హాలీవుడ్‌ వాళ్లు కూడా ఇక్కడికి వచ్చి సినిమాలు నిర్మించుకునేలా సిద్ధం చేస్తామన్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వస్తున్న వారంతా తెలంగాణ గౌరవాన్ని కాపాడేందుకే వస్తున్నారని, తాను చంద్రబాబులా చిల్లర రాజకీయాలు చేయడం లేదని కేసీఆర్‌ అన్నారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

పట్టువదలని విక్రమార్కుడిలా తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్‌ పాటుపడుతున్నారని, తెలంగాణ అభివృద్ధిని కోరుతూ తాము టీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ప్రకటించారు. ఎమ్మెల్యేలు పారిపోతారని భావించి.. వారిని గదిలో కూర్చోబెట్టుకుని, మీకేం కావాలి? మీ పిల్లలకేం కావాలి? అంటూ మమ్మల్నే కొనేందుకు సిద్ధమవుతున్నారని ఆరోపించారు.

తెరాసలోకి తీగల, తలసాని

తెరాసలోకి తీగల, తలసాని

కాంట్రాక్టర్ల చేతికి టీడీపీ వెళ్లిపోయిందని తలసాని విమర్శించారు. బిడ్డా! మరో జన్మ ఎత్తినా తెలంగాణలో నీ ప్రభుత్వం రాదని, హైదరాబాద్‌ మాది అని, మా తడాఖా చూపిస్తామని సవాల్‌ విసిరారు. తాను 32 ఏళ్లపాటు టీడీపీలో ఉన్నా ఏ పార్టీలోకి మారలేదని, తెలంగాణ బిడ్డగా తల్లి రుణం తీర్చుకునేందుకే టీఆర్‌ఎస్‌లో చేరానని తీగల కృష్ణారెడ్డి అన్నారు.

కృష్ణారెడ్డి, తాను హైదరాబాదును శాసించేవాళ్లమని, రాబోయే రోజుల్లో మా సంగతి, హైదరాబాదు సంగతి చూపిస్తామని తెలంగాణ టీడీపీ నేతలను ఉద్దేశించి అన్నారు. టీడీపీ నుండి నేతలు పోతే వంద మందిని తయారు చేస్తామని బాబు చెబుతున్నారని, కానీ తమలాంటి ఒక్కరిని తయారు చేసేందుకు ఆయన జన్మ సరిపోదన్నారు.

బిడ్డా నీలాంటి దగాకోరు మనస్తత్వం ఉన్నవాడిని మేము ఒక్కడ్ని తయారు చేయలేమన్నారు. టీడీపీలో ఉన్న తమనే కొనేందుకు ప్రయత్నించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చే దగ్గర బాబు తాను సీఎంగా ప్రకటించుకున్నారని, తెలంగాణలో మాత్రం కృష్ణయ్యను ప్రకటించారని, సిగ్గుందా అని ధ్వజమెత్తారు.

English summary

 Photos: Teegala, Talasani join TRS in the presence of CM K Chandrasekhar rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X