వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుడిలో జగన్ చేతులెత్తి, అప్పటిదాకా నిలదీస్తా(పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: హుధుద్ తుఫాన్ ప్రభావంతో భారీగా నష్టపోయిన మన్యంలోని కాఫీ తోటల రైతులను ప్రభుత్వం మానవత్వంతో ఆదుకోవాలని ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోరారు.

శనివారం సాయంత్రం ఆయన విశాఖ జిల్లాలోని పాడేరు మండలంలోని మోదపల్లి గ్రామాన్ని వర్షంలోనే సందర్శించి రైతులతో కలసి కాఫీ తోటలను పరిశీలించారు.

ఈ సందర్భంగా తుఫాన్ కారణంగా ఎవరెంత నష్టపోయిందీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తాము సర్వం కోల్పోతే అధికారులు మాత్రం అంతంతమాత్రంగా సర్వే చేస్తున్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకొచ్చారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

బాధితుల ఫిర్యాదు పైన స్పందించిన జగన్ కాఫీ తోటలు నష్టపోయిన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందేవరకూ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు.

వైయస్ జగన్

వైయస్ జగన్

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గిరిజన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏజెన్సీలో కాఫీ తోటలకు వాటిల్లిన నష్టాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

దీంతో ఏళ్ల తరబడి గిరిజన రైతులకు రావాల్సిన ఆదాయాన్ని కోల్పోయారన్నారు. ఈ పరిస్థితుల్లో మొక్కుబడిగా నష్ట పరిహారాన్ని అందించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

ఎకరాకు కనీసం లక్ష రూపాయల నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఆయనతో పాటు ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్‌నాథ్, తదితరులు పాల్గొన్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

హుధుద్ తుఫాను బారిన పడిన విశాఖపట్నంలోని తుమ్మపాల ప్రాంతాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శనివారం సందర్శించిన విషయం తెలిసిందే.

 వైయస్ జగన్

వైయస్ జగన్

అక్కడి వారిని పరామర్శించారు. తుఫాను సాయం ఎలా అందుతోందో వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి చెరుకు రైతులు తమ గోడును జగన్ వద్ద వెళ్లబోసుకున్నారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని మండిపడ్డారు.

 వైయస్ జగన్

వైయస్ జగన్

సహకార రంగంలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను నష్టాల్లోకి తీసేసి.. వాటిని సొంత మనుషులకు అమ్మేయడం ఈ ప్రభుత్వానికి మామూలేనని మండిపడ్డారు.

English summary
Photos: YS Jagan visited hudhud cyclone effected areas in vizag on saturday
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X