హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఉదయ్ కిరణ్ కిడ్నాప్, హత్య: ఏమీ ఎరగనట్లే.. (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పన్నెండేళ్ల ఉదయ్‌ను అపహరించి, హత్య చేసి ఏమీ ఎరగనట్లే నిందితులు తిరగడం ఆశ్చర్యానికి గురి చేసింది. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేటలో గురువారం సాయంత్రం కిడ్నాప్‌కు గురైన ఉదయ్‌ కిరణ్‌ (12)హత్యకు గురయ్యాడు. డబ్బు కోసం వరుసకు సోదరుడయ్యే యువకుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడు శుక్రవారం పోలీసులకు లొంగిపోయాడు.

హయత్‌నగర్‌ మండలం బాటసింగారం గ్రామానికి చెందిన కారోబార్‌ (బిల్‌ కలెక్టర్‌) పెంటయ్య కుమారుడు ఉదయ్‌కిరణ్‌ (12) పెద్ద అంబర్‌పేటలోని రాజశ్రీ విద్యామందిరంలో ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం పాఠశాలకు వెళ్లిన బాలుడు సాయంత్రం ఇంటికి రాకపోవడంతో అతడి స్నేహితుడైన సోహెల్‌ను తల్లిదండ్రులు ప్రశ్నించారు.

పథకం ప్రకారం కిడ్నాప్‌..

పథకం ప్రకారం కిడ్నాప్‌..

బాటసింగారం గ్రామానికే చెందిన ఉదయ్‌కిరణ్‌కు వరుసకు సోదరుడైన భీమగళ్ల నవీన్‌ (22), చెంచెల ఉపేందర్‌ (20), రేపాక నర్సింగ్‌, ఉదయ్‌కిరణ్‌ పెద్దనాన్న కొడుకు కొడిశెల నవీన్‌ (మాజీ సర్పంచ్‌ రాధమ్మ కుమారుడు) బాలుడ్ని కిడ్నాప్‌ చేసి అతని తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయాలని పథకం పన్నారు.

బైక్‌పై ఎక్కించుకుని..

బైక్‌పై ఎక్కించుకుని..

గురువారం సాయంత్రం పాఠశాల నుంచి బయటికి వచ్చిన ఉదయ్‌కిరణ్‌ తోటి విద్యార్థులతో కలిసి బస్సు ఎక్కేందుకు పెద్దఅంబర్‌పేట చౌరస్తాలోని బస్టాప్‌ వద్దకు వచ్చాడు. ఆ సమయంలో భీమగళ్ల నవీన్‌ బైకుపై వచ్చి ఉదయ్‌ను పిలిచాడు. తాను బాటసింగారం వెళ్తున్నానని చెప్పడంతో ఉదయ్‌ బైకు ఎక్కాడు.

సొహైల్‌ను వద్దన్నారు..

సొహైల్‌ను వద్దన్నారు..

మరో విద్యార్థి సోహెల్‌ కూడా బైకు ఎక్కే ప్రయత్నం చేయగా, ముగ్గురం వెళ్తే పోలీసులు పట్టుకుంటారని నవీన్‌ వారించటంతో దిగిపోయాడు.

చెరువు వద్దకు తీసుకెళ్లి..

చెరువు వద్దకు తీసుకెళ్లి..

ఉదయ్‌కిరణ్‌ను మన్సూరాబాద్‌లోని పెద్ద చెరువు వద్దకు తీసుకెళ్లిన నవీన్‌ రాత్రి 7 గంటల సమయంలో చేతితో నోరు, ముక్కు గట్టిగా అదిమిపట్టి మెడకున్న టైని గొంతుకు బిగించి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని చెరువులో పడేశాడు.

బండరాయి కట్టాడు..

బండరాయి కట్టాడు..

నీటిలో పైకి తేలకుండా ఉండేందుకు పెద్ద గ్రానైట్‌ రాయి తెచ్చి మృతదేహంపై పెట్టి అతడి దుస్తులతోనే కట్టిపడేశాడు. ఉదయ్‌ను నవీన్‌ ఒక్కడే హత్య చేసినప్పటికీ.. మిగతా ముగ్గురు పథకం రచించి వెనుక ఉండి సహకారం అందించారని పోలీసులు తెలిపారు.

లొంగిపోయిన నవీన్‌..

లొంగిపోయిన నవీన్‌..

ఉదయ్‌ను హత్య చేసిన తరువాత నలుగురు గ్రామంలోనే తిరగసాగారు.కిడ్నాప్‌కు సంబంధించి గురువారం రాత్రి పోలీసులు గ్రామంలో ఆరా తీశారు. ఉదయ్‌ను బైకుపై తీసుకెళ్లిన వ్యక్తి తమ ఊరి వాడేనని, చూస్తే గుర్తుపడతానని తోటి విద్యార్థి సోహెల్‌ చెప్పాడు. దీంతో తమ గుట్టు బయటపడుతుందని భావించిన నవీన్‌ శుక్రవారం సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

మృతదేహం వెలికితీత..

మృతదేహం వెలికితీత..

హత్యకు సహకరించిన మిగిలిన ముగ్గురి పేర్లు చెప్పడడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో ఉదయ్‌ కిరణ్‌ మృతదేహాన్ని వెలికితీయించారు.

డబ్బులు డిమాండ్‌ చేసేందుకే..

డబ్బులు డిమాండ్‌ చేసేందుకే..


బాలుడి తండ్రి పెంటయ్య గ్రామంలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. అతడి వద్ద డబ్బు వసూలు చేసేందుకు ఉదయ్‌కిరణ్‌ను కిడ్నాప్‌ చేయాలని నలుగురూ కలిసి పథకం వేశారు. కిడ్నాప్‌ చేసి డబ్బులు డిమాండ్‌ చేసినా ఆ తరువాత తమను గుర్తుపడతాడన్న భయంతో ప్రధాన నిందితుడైన బి.నవీన్‌ బాలుడ్ని హత్య చేశాడు.

పాఠశాల విడిచిన అనంతరం పెద్దఅంబర్‌పేటలో బస్సు కోసం వేచి చూస్తుండగా ఓ వ్యక్తి బైకుపై వచ్చి తీసుకువెళ్లాడని సోహెల్‌ చెప్పాడు. ఉదయ్‌ కిడ్నాప్‌నకు గురైనట్టు భావించిన తల్లిదండ్రులు హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ప్రధాన నిందితుడైన భీమగళ్ల నవీన్‌ గతంలో హోంగార్డుగా పనిచేసి ప్రస్తుతంలో హోటళ్లలో వంటమనిషిగా పని చేస్తున్నాడు. మరో నిందితుడు చెంచెల ఉపేందర్‌ మౌంట్‌ ఓపెరాలో పార్కింగ్‌ నిర్వాహకుడిగా పనిచేస్తుండగా.. రేపాక నర్సింగ్‌ ఎంబీఏ పూర్తి చేసి ప్రస్తుతం చింతల్‌కుంటలోని వుడ్‌ వరల్డ్‌ ఫర్నిచర్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. నిందితులపై హత్య, కిడ్నాప్‌, కుట్ర, బాలల వేధింపుల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్‌ తెలిపారు.

English summary
A 13-year-old boy Uday Kiran was allegedly abducted and murdered by a youth in Telangana's Ranga Reddy district with police arresting four persons in this connection.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X