చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమరావతికి నారావారిపల్లె పుట్టమన్ను ఇదే: తొలిసారి హెలికాప్టర్‌లో బాబు (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుపతి: నవ్యాంధ్రప్రదేశ్‌కు అమరావతిలో ఏర్పాటు చేయనున్న రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమి పూజ చేయనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్వగ్రామమైన నారావారిపల్లెలో ఉన్న నాగాలమ్మ పుట్టమన్నును మంగళవారం చంద్రబాబు సేకరిస్తారు.

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపాన కృష్ణానది కరకట్టపై తాత్కాలిక నివాస గృహం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలిసారి హెలికాప్టర్‌లో ప్రయాణమయ్యారు. తాడేపల్లి మండలం, ఉండవల్లి గ్రామ పరిధిలోని కరకట్టపై లింగమనేని ఎస్టేట్స్ గెస్ట్‌హౌస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు తాత్కాలిక నివాసముంటున్న విషయం విదితమే.

ఇప్పటికే ఆయన నివాసం వద్ద హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. అయితే సోమవారం విశాఖపట్నంలో జరిగే కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండటంతో ఇక్కడి నుంచి ఆయన హెలికాప్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విజయవాడ నగరంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసుకు వెళ్లే సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేస్తున్నందున వాహనదారులకు సమయం వృథా అవుతోందని అధికారులు గుర్తించారు.

అందువల్ల ముఖ్యమంత్రి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే సమయంలో హెలికాప్టర్‌ను ఉపయోగించాలని తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఆయన నివాస గృహం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు.

బ్రహ్మోత్సవాలకు పుట్టమన్ను..

బ్రహ్మోత్సవాలకు పుట్టమన్ను..

తిరుమల్లో కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరునికి 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలకు మంగళవారం పుట్టమన్నును సేకరిస్తారు.

వెంకన్న పట్ల భక్తివిశ్వాసాలు...

వెంకన్న పట్ల భక్తివిశ్వాసాలు...

వెంకన్న పట్ల అపార భక్తివిశ్వాసాలున్న సి ఎం, అదే రోజైన మంగళవారం స్వామివారి పాదాల చెంత ఉన్న నారావారి పల్లెలో పుట్టమన్ను సేకరించనున్నారు.

అమరావతికి అంకురార్పరణ

అమరావతికి అంకురార్పరణ

పుట్టమన్ను సేకరించి అమరావతి రాజధానికి అంకురార్పణ చేయనున్నారు. కాగా జన్మభూమి కమిటీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని, పవిత్ర జలాలను కూడా తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లాలోని నదుల నుంచి...

జిల్లాలోని నదుల నుంచి...

చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి, బహుదా,పింఛ,కుశస్థలి, తిరుమల్లోని పాపవినాశనం, తిరుపతిలోని కపిలతీర్థాల నుంచి పవిత్ర జలాలను,మట్టిని సేకరించి అమరావతికి తీసుకువెళ్ళనున్నారు.

నాగాలమ్మ పుట్టుమన్ను

నాగాలమ్మ పుట్టుమన్ను

నారావారి పల్లెలోని నాగాలమ్మ పుట్టదగ్గర మన్ను సేకరించనున్న నేపధ్యంలో జిల్లా కలెక్టర్ సిద్దార్థ్‌జైన్, జిల్లా సంయుక్త కలెక్టర్ భరత్ గుప్త, ఎస్పీ గోపినాథ్ జెట్టి, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఆప్రాంతాన్ని పరిశీలించారు.

English summary
Nagalamma Puttamannu at Andhra Pradesh CM Nara Chandrababu Naidu's village Naravaripalle in Chittoor district for Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X