వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వివాహేతర సంబంధం:అనుమానంతో ప్రియుడిపై రెండు సార్లు దాడి, చివరికిలా..

తనను హత్య చేస్తారని అనుమానించి ప్రత్యర్థి ప్రాణాలు తీశాడు ఓ వ్యక్తి . ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

తూర్పుగోదావరి:తనను చంపుతాడనే భయంతో ఓ వ్యక్తిని కుటుంబసభ్యుల సహయంతో హతమార్చాడు వీరబాబు అనే వ్యక్తి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకొంది. హత్యకు పాల్పడినవారిలో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు.

పిఠాపురం మండలం పి.రాయవరానికి చెందిన చక్రవర్తుల నాగేశ్వర్ రావు అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన తొమ్మిది మంది వ్యక్తులు హత్యచేశారు.ఈ ఘటన గత నెల 23వ, తేదిన వెలుగుచూసింది.

police arrested five members for murder case

పిఠాపురం మండలం రాపర్తి గ్రామానికి చెందిన పంట కాలువలో నాగేశ్వర్ రావు మృతదేహం దొరికింది.నాగేశ్వర్ రావు ఇంటి ముందు ఉండే కె.వీరబాబు అతని కుటుంబసభ్యులు నాగేశ్వర్ రావును హతమార్చారని పోలీసులు తెలిపారు.

నాగేశ్వర్ రావు కు తన భార్య అర్జవేణిపై అనుమానం ఉంది. అర్జవేణికి తన ఇంటి ఎదురుగా ఉన్న వీరబాబుతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానం. దీంతో ఇద్దరినీ ఒకేసారి చంపాలని నాగేశ్వర్ రావు ప్రయత్నించాడు.

కత్తితో నాగేశ్వర్ రావు దాడిచేసిన సమయంలో అర్జవేణి గాయపడింది. వీరబాబు తప్పించుకొన్నాడు. 9 మాసాల క్రితం ఈ ఘటన చోటుచేసుకొంది.ఈ కేసును లోక్ అదాలత్ లో పరిష్కరించుకొన్నారు.

నాగేశ్వర్ రావు, అర్జవేణిలు పిల్లలతో కలిసి నవఖండ్రవాడ వెళ్ళారు.అయితే నాగేశ్వర్ రావుకు ఇంకా అనుమానం పోలేదు.వీరబాబుతో తరచూ గొడవపడేవాడు.

గత నెల 15వ, తేదిన మోటార్ సైకిల్ పై వెళ్తోన్న వీరబాబును ఆటోతో ఢీకొట్టి చంపేందుకు యత్నించాడు.అయితే వీరబాబు తప్పించుకొన్నాడు.

తనకు నాగేశ్వర్ రావు నుండి ప్రాణహని ఉందని భావించి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి నాగేశ్వర్ రావును హతమార్చి పంటకాలువలో పడేశారని పోలీసులు తెలిపారు.

English summary
police arrested five members for murder case in eastgodavari district.veerababu murdered nageshwar rao with the help of family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X