హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వ్యభిచార ముఠా గుట్టరట్టు: యువతులు, విటుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మందిని రిమాండ్‌కు తరలించారు. గచ్చిబౌలి హౌసింగ్ బోర్డు కాలనీలోని జయభేరి లేఅవుట్ విల్లా నంబర్ -5ను ఆరు నెలల క్రితం హైదర్‌షాకోట్‌కు చెందిన ఎస్‌కే మాలిక్ అద్దెకు తీసుకున్నాడు. మూడు నెలలుగా హైటెక్ వ్యభిచారం నిర్వహిస్తున్నాడు.

తనతో పాటు ప్రమోద్ పాటిల్, సమీరుల్లాఖాన్, మహ్మద్ షఫీలతో కలిసి ఆన్‌లైన్‌లో ప్రకటన లు, ఫోన్ నంబర్లు ఇస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. ఫోన్‌లో అమ్మాయిల కోసం సంప్రదించిన వారికి వాట్సాప్‌లో ఫోటోలు పంపిస్తూ బేరాలు కుదుర్చుకుంటున్నారు.

వివిధ నగరాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు దాడి చేసి నిర్వాహకులు మాలిక్, ప్రమోద్ పటేల్, సమీరుల్లాఖాన్, మహ్మద్ షఫీలతోపాటు, బెంగళూరు, ముంబైలకు చెందిన అమ్మాయిలను, విటులు పాలకొండ వంశీకృష్ణ, మహేష్‌లను, వంట, పని మనుషులైన రాజ్‌శర్మ, నాగేందర్ ఖష్మ, సయ్యద్ అబుబాకర్‌లను అరెస్ట్ చేశారు. మొత్తం 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, అమ్మాయిలను రెస్క్యూ హోంకు తరలించారు.

Police attacked on brothel houses in Hyderabad

మరో టనలో ముగ్గురు యువతులు, ఇద్దరు విటులు

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాప్రా సర్కిల్ హెచ్‌బీకాలనీ వెంకటేశ్వరనగర్‌లో కొత్తగా నిర్మించిన నివాసగృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందగా దాడి చేసి వ్యభిచారం చేస్తున్న ముగ్గురు యువతులు, ఇద్దరు విటులు జవహర్‌నగర్‌కు చెందిన విజయ్ (30), తిరుమలనగర్‌కు చెందిన శివ (21)అరెస్ట్ చేశారు. నిర్వాహకురాలు అంజలి (30) పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరో ఘటనలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. షేక్‌పేట ఓయూ కాలనీలోని ఓ ఇంట్లో విజయ్ అలియాస్ పాండు వ్యభిచారం నిర్వహిస్తున్నాడన్న సమాచారంతో పోలీసులు దాడి చేయగా నిర్వాహకుడితో పాటు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ సెక్స్ వర్కర్, విటుడు పట్టుపడ్డాడు. వీరి వద్ద నుంచి రూ.1,200 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Police attacked on brothel houses in Hyderabad. And accused are arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X