వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ పంచ్ రవికిరణ్ విడుదల: అరెస్టు తర్వాత ఎక్కడికి తీసుకెళ్లారు?

ముఖ్యంగా పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ కు, వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధముందా? అన్న కోణంలో పోలీసులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇంటూరి రవికరణ్ అరెస్టు ఏపీలో సంచలనం రేకెత్తించింది. ఆయన అరెస్టుపై సర్వత్రా భిన్నాభిప్రాయలు వ్యక్తమవగా.. ఎట్టకేలకు దిగొచ్చిన పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు.పోలీసుల అదుపు నుంచి బయటపడ్డ రవికిరణ్ మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

రవి కిరణ్ అరెస్టు అందుకేనా, జగన్ మీడియా మునుగుతుందా?: గతంలో రామోజీ 'ఈనాడు'రవి కిరణ్ అరెస్టు అందుకేనా, జగన్ మీడియా మునుగుతుందా?: గతంలో రామోజీ 'ఈనాడు'

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లోని స్వగృహంలో పోలీసులు తనను అరెస్టు చేసిన అనంతరం ఎస్పీ ఆఫీసుకు తరలించినట్లు రవికరణ్ తెలిపారు. ఆ తర్వాత మధ్యాహ్నాం 3గం.కు ఒక ఆటోలో తనను బయటకు తీసుకెళ్లారని, ఆపై వేర్వేరు వాహనాల్లోకి తనను మార్చారని పేర్కొన్నారు.

Political punch

అలా సుమారు మూడు గంటల పాటు సీఎం క్యాంప్ ఆఫీసు చుట్టూ తిప్పారని, అనంతరం ఓ ప్రైవేటు గెస్ట్ హౌజ్ కు తీసుకెళ్లి విచారణ చేశారని రవికిరణ్ తెలిపారు. పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ వెనుక ఎవరి హస్తం ఉంది?, సోషల్ మీడియాలో పెయిడ్ ప్రాపగండాతోనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారా? అని పోలీసులు ప్రశ్నించినట్లు రవికిరణ్ వివరించారు.

ముఖ్యంగా పొలిటికల్ పంచ్ వెబ్ సైట్ కు, వైసీపీ పార్టీకి ఏమైనా సంబంధముందా? అన్న కోణంలో పోలీసులు తనను ప్రశ్నించినట్లు తెలిపారు. పోలీసులకు ప్రశ్నలకు బదులుగా.. పొలిటికల్ పంచ్ పోస్టులకు బాధ్యత తనదేనని, ఎవరి ప్రమేయం లేదని తాను పేర్కొనట్లు తెలియజేశారు. ఈ నెల 25,26తేదీల్లో మళ్లీ విచారణకు రావాల్సిందిగా ఆదేశించారని వెల్లడించారు.

కాగా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లపై దుష్ప్రచారం చేస్తున్నారన్న కారణంగా రవికిరణ్ ను అరెస్టు చేస్తున్నట్లు.. ఆయన భార్యతో పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

English summary
Political Punch cartoonist Ravikiran was released from police on yesterday after pouring mixed Opinions in social media
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X