వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా తూచ్: ప్రశాంత్‌కిషోర్ పేరుతో పక్కాప్లాన్‌.., జగన్‌కు కీలక సూచన

వైసిపి కోసం పని చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేశారని, మళ్లీ టిడిపియే అధికారంలోకి వస్తుందని ఆయన సర్వేలో తేలిందని ప్రచారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

అమరావతి: వైసిపి కోసం పని చేస్తున్న ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేశారని, మళ్లీ టిడిపియే అధికారంలోకి వస్తుందని ఆయన సర్వేలో తేలిందని ప్రచారం జరిగింది. దీనిపై ఇన్నాళ్లు ఆయన లేదా వైసిపి స్పందించలేదు.

జగన్‌పై అభిమానం: సర్వేపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, రోజాకు నెగిటివ్ రిపోర్ట్‌పై.. జగన్‌పై అభిమానం: సర్వేపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, రోజాకు నెగిటివ్ రిపోర్ట్‌పై..

జగన్ బుధవారం వైసిపి నేతలతో భేటీ అయిన సందర్భంలో ప్రశాంత్ కిషోర్ పెదవి విప్పారు. తాను ఎలాంటి సర్వే చేయలేదని, ఇప్పుడిప్పుడే పని ప్రారంభిస్తున్నానని చెప్పారు. దీంతో గతంలో వచ్చిన సర్వేలు అన్నీ వట్టివే అని తేలింది.

ఇదీ ప్రశాంత్ కిషోర్ అసలు వ్యూహం: 'సర్వే' తమ ప్రవృత్తి కాదన్నాడు!..ఇదీ ప్రశాంత్ కిషోర్ అసలు వ్యూహం: 'సర్వే' తమ ప్రవృత్తి కాదన్నాడు!..

అందుకే... ప్రశాంత్ కిషోర్ పేరుతో ప్రచారం.. షాకిచ్చారు

అందుకే... ప్రశాంత్ కిషోర్ పేరుతో ప్రచారం.. షాకిచ్చారు

దీంతో టిడిపి అనుకూలురు వ్యూహాత్మకంగానే ప్రశాంత్ కిషోర్ పేరును ఉపయోగించి తమ పార్టీయే గెలుస్తుందని ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. గతంలో మోడీ, నితీష్ కుమార్‌లను గెలిపించిన ప్రశాంత్ కిషోర్ సర్వేలోనే టిడిపి గెలిచిందని తేలితే, అది తమకు లాభిస్తుందనే ఉద్దేశ్యంతోనే ఇలా ఉత్తుత్తి ప్రచారం చేసి ఉంటారా అనే చర్చ సాగుతోంది. ప్లాన్‌తోనే ఇలా చేశారని అంటున్నారు. ప్రశాంత్ కిషోర్ సర్వేలో టిడిపి - బిజెపికి 120 వరకు సీట్లు, వైసిపికి 47 సీట్లు వస్తాయని తేలిందని ప్రచారం జరిగింది. తాను ఎలాంటి సర్వే చేయలేదని ఆయన షాక్ ఇచ్చారు. అవసరమని భావించినప్పుడు మాత్రమే సర్వేలు చేస్తామని, అదే సమయంలో అది ప్రధానం కాదని చెప్పారు. దీంతో ఆయన పేరుతో టిడిపికి అనుకూలంగా ప్రచారం చేసే ప్రయత్నాలు జరిగాయని అంటున్నారు.

ఏఏ అంశాల్లో సహకరిస్తారో నేతలకు చెప్పిన జగన్

ఏఏ అంశాల్లో సహకరిస్తారో నేతలకు చెప్పిన జగన్

ఏపీలో రాజకీయ పరిస్థితులపై తమ కార్యకలాపాలు త్వరలో మొదలు పెడతానని ప్రశాంత్ కిషోర్ బుధవారం చెప్పారు. పార్టీని సంస్థాగతంగా శాస్త్రీయంగా విశ్లేషించి మరింత పటిష్టతకు ప్రశాంత్ కిషోర్ సేవలను తీసుకుంటున్నామని జగన్ చెప్పారు. ఏఏ అంశాలపై ఆయన పార్టీకి సహకరిస్తారో జగన్.. నేతలకు చెప్పారు.

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన

జగన్‌కు ప్రశాంత్ కిషోర్ కీలక సూచన

2019 ఎన్నికల్లో వైసిపి గెలుపే లక్ష్యంగా జగన్ ముందుకు కదులుతున్నారు. ఇందుకోసం ప్రశాంత్ కిషోర్‌ను వ్యూహకర్తగా నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన జగన్‌కు ఓ కీలక సూచన చేశారని తెలుస్తోంది. ఏపీలోని 13 జిల్లాల్లో పాదయాత్ర చేపట్టాలని పరోక్షంగా సూచన చేశారని తెలుస్తోంది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి వైసిపి అమరావతి షిఫ్ట్ కానుంది.

జగన్ సిద్ధం.. ఓడిపోయే వారికి టిక్కెట్లివ్వవద్దని..

జగన్ సిద్ధం.. ఓడిపోయే వారికి టిక్కెట్లివ్వవద్దని..

ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు వైయస్ జగన్ త్వరలో పాదయాత్ర చేపట్టనున్నారని తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవాలంటే సభలు, దీక్షలు మాత్రమే సరిపోవని, ప్రజలను నేరుగా కలవాలని సూచించారు. దీంతో జగన్ అందుకు పాదయాత్రనే సరైన మార్గమని భావిస్తున్నారని చెబుతున్నారు. 2004లో వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో రావడంలో పాదయాత్ర కీలక పాత్ర పోషించింది. ప్రశాంత్ కిషోర్ మరో సూచన కూడా చేశారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశముందని, ఓడిపోయే వారిని గుర్తించి టిక్కెట్లు ఇవ్వవద్దని కూడా సూచించారని తెలుస్తోంది. దాదాపు 25 మంది పేరుల ప్రశాంత్ కిషోర్.. జగన్‌కు ఇచ్చారని తెలుస్తోంది.

English summary
Election Strategis Prashant Kishor Meeting With YSRCP chief YS Jaganmohan Reddy and YSRCP Leaders on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X