వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబూ! సమాధానం చెప్పు: పురంధేశ్వరి ఝలక్, కేశినేని వ్యాఖ్యలపై సీరియస్

బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏపీ పర్యటన తర్వాత రోజే ఆ పార్టీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఏపీ పర్యటన తర్వాత రోజే ఆ పార్టీ మహిళా నాయకురాలు పురంధేశ్వరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఝలక్ ఇచ్చారు. టిడిపి ఎంపి కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.

పురంధేశ్వరికి అమిత్ షా ఝలక్?: అలాంటి వాళ్లు ఎప్పటికీ వద్దుపురంధేశ్వరికి అమిత్ షా ఝలక్?: అలాంటి వాళ్లు ఎప్పటికీ వద్దు

బిజెపితో పొత్తు వల్ల తనకు ఎక్కువ ఓట్లు రాలేదని, వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుంటే తాను గతంలో వచ్చిన మెజార్టీకి డబుల్ మెజార్టీ సాధిస్తానని అన్నారని, నాని చేసిన ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

కేశినేని వ్యాఖ్యలపై సీరియస్

కేశినేని వ్యాఖ్యలపై సీరియస్

టిడిపి నేతలు ఆయా సందర్భాల్లో బిజెపిపై మండిపడ్డ సందర్భాలు ఉన్నాయి. టిడిపి నేతల వ్యాఖ్యలకు బిజెపి అప్పటికి కౌంటర్ ఇచ్చేంది. కానీ కేశినేని నాని వ్యాఖ్యలను మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది.

ఆ వ్యాఖ్యలపై సీరియస్‌కు ఇదీ కారణం

ఆ వ్యాఖ్యలపై సీరియస్‌కు ఇదీ కారణం

కేశినేని నాని వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవడానికి కూడా కారణం ఉంది. మిగతా వాటిని రాజకీయ కోణంలో చూడవచ్చు. కానీ బిజెపి వల్లే తమకు ఓట్లు తగ్గాయని కేశినేని వ్యాఖ్యానించడాన్ని మాత్రం అలా చూడటం లేదు. బిజెపితో పొత్తు వల్ల కలిసి వస్తుందని భావించిన టిడిపి.. ఇప్పుడు అలా మాట్లాడటం ఏమిటని మండిపడుతున్నారు. అలాంటప్పుడు పొత్తు ఎందుకు పెట్టుకున్నారనేది బిజెపి ప్రశ్న.

చంద్రబాబు సమాధానం చెప్పాలి

చంద్రబాబు సమాధానం చెప్పాలి

బిజెపితో పొత్తు వల్ల తమకు ఓట్లు తగ్గాయని, లేదంటే టిడిపి మరింత మెజార్టీతో గెలిచేదన్న వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా తీసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో పురంధేశ్వరి మరోసారి స్పందించారు. చంద్రబాబు సమాధానం చెప్పాలని నిలదీసారు.

ఉత్సాహం నింపిన అమిత్ షా

ఉత్సాహం నింపిన అమిత్ షా

పురంధేశ్వరి ఇంకా మాట్లాడుతూ... అమిత్ షా తెలుగు రాష్ట్రాల్లో పర్యటించి తమ పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారని చెప్పారు. ఏపీలో అన్ని బూత్‌లలో పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. బిజెపి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని, కార్యకర్తల మనోభావాలను అమిత్ షా దృష్టికి తీసుకు వెళ్తామన్నారు.

English summary
BJP leader Purandeswari questioned AP CM Chandrababu Naidu to respond on TDP MP Kesineni Nani comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X