వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మనం సమర్థిస్తున్నామా: మోడీకి పురంధేశ్వరి ఘాటు లేఖ, జగన్‌కు ఊరట

మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. పార్టీ ఫిరాయింపులపై ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాకు లేఖ రాశారు.

చంద్రబాబు ప్రభుత్వంలో మనం కూడా

చంద్రబాబు ప్రభుత్వంలో మనం కూడా

ఈ లేఖలో ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, ఆమె లేఖలో టిడిపిని, చంద్రబాబును టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. టిడిపి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, ఏపీ ప్రభుత్వంలో మనం ఉన్నాం కాబట్టి.. మనం సమర్థించినట్లవుతుందని ఆమె లేఖలో పేర్కొన్నారు.

పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది

పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది

పార్టీ ఫిరాయింపులపై ప్రస్తుతం ఉన్న చట్టం అపహాస్యం అవుతోందని, కఠినమైన చట్టం తీసుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని పురంధేశ్వరి అభిప్రాయపడ్డారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తే పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్పారు.

అపహాస్యం

అపహాస్యం

తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపుల చట్టం అపహాస్యం అవుతోందన్నారు. మనం ప్రభుత్వంలో భాగస్వాములం కాబట్టి ఫిరాయింపులను ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ఇది సరికాదన్నారు.

జగన్‌కు ఊరట

జగన్‌కు ఊరట

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం సరికాదన్నారు. టిడిపి వైసిపి నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిందని చెప్పారు. రాజ్యాంగ నిబంధనలను తుంగలొ తొక్కారన్నారు.

కాగా, పురంధేశ్వరి బీజేపీ ముఖ్యనేతలకు ఈ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. పురంధేశ్వరి లేఖ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు మరింత ఊరట నిచ్చే అంశమేనని చెప్పవచ్చు.

English summary
BJP leader Purandeswari tried to corner AP CM Chandrababu Naidu after cabinet reshuffle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X