హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'ఏపీలో భారీ బొగ్గు కుంభకోణం', 'ఇంజనీర్లపై బాబుకు నమ్మకం లేదు'

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో భారీ బొగ్గు కుంభకోణం జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. గుజరాత్‌కు చెందిన పారిశ్రామికవేత్త అదానీకి భారీ బొగ్గు కాంట్రాక్టును కొనసాగించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు పెద్ద ఎత్తున గండి పడిందన్నారు.

అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తగ్గినా ఏపీ ప్రభుత్వం ఎక్కువ ధర చెల్లిస్తోందన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో రూ.1000కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు.‘బిగ్‌బాస్', ‘స్మాల్‌బాస్'లు రూ.1000 కోట్లు వెనకేసుకున్నారని రఘువీరా ఆరోపించారు.

Raghuveera Reddy fires on AP Cm Chandrababu Naidu

ఈ విషయంపై తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, నిజాలను నిగ్గు తేల్చేందుకు సీఎం చంద్రబాబు అఖిలపక్షాన్ని వేసి తన నిజాయితీని నిరూపించుకోవాలని రఘవీరా రెడ్డి సవాల్ విసిరారు.

'విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం సిగ్గుచేటు'

ఏపీ సీఎం చంద్రబాబుకు దేశంలోని ఇంజినీర్లపై నమ్మకం లేక విదేశీ పెట్టుబడిదారుల వెంటబడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాజధాని నిర్మాణానికి విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించడం సిగ్గుచేటని అన్నారు.

English summary
Andhra Pradesh Pcc Cheif Raghuveera Reddy fires on AP Cm Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X