హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీకి రైల్వే శాఖ దసరా తాయిలం: విశాఖ-బెజవాడ రైలు, టికెట్ ధర 20కి పెంపు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దసరా సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ వాత పెట్టింది. రైల్వే స్టేషన్లలో అసౌకర్యం కలగకుండా, రద్దీని నివారించేందుకు గాను సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్‌ ధరను రూ. 10 నుంచి రూ.20కి పెంచింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే పీఆర్ఓ ఎం.ఉమాశంకర్‌ కుమార్‌ తెలిపారు.

సెప్టెంబర్ 30 (శుక్రవారం) నుంచి అక్టోబరు 12 వరకు ఈ కొత్త ధరలు అమలులో ఉంటాయని ఆయన వెల్లడించారు. మరోవైపు ఈ ఏడాది రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన కొత్త రైళ్లు త్వరలో పట్టాలు ఎక్కనున్నాయి. కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు ప్రకటించిన వాటిలో 'హమ్‌సఫర్', 'ఉదయ్' రైళ్లు ఏపీలో కూతపెట్టనున్నట్టు తెలుస్తోంది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త టైం టేబుల్‌లో మొత్తం 20 కొత్త రకం రైళ్లను అధికారులు చేర్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా ప్రతి ఏడాది జులై నుంచి కొత్త టైం టేబుల్ అమల్లోకి వస్తుంది. అయితే ఈసారి 'హమ్‌సఫర్', 'ఉదయ్'ల పేరుతో కొత్త రైళ్లను ప్రారంభించాలని నిర్ణయించడంతో జులై నాటికి కసరత్తు పూర్తి కాలేదు.

యూపీఏ హయాంలో ప్రకటించి పట్టాలెక్కని రెండు ఎక్స్‌ప్రెస్‌లను మాత్రం ఇటీవల రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా ప్రారంభించారు. కొత్తగా ఇప్పుడు రెండు రైళ్లను ప్రకటించి టైంటేబుల్‌లో నమోదే చేసే అవకాశం కనిపిస్తోంది. వీటితో పాటు ఏపీ మీదుగా ప్రయాణించే రైళ్లు మరో ఆరు వరకు ఉన్నట్టు తెలిసింది.

Railways hike platform ticket price to Rs. 10 to 20

ఇందులో ఏపీకి తిరుపతి-జమ్ముతావి హమ్‌సఫర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం మధ్య ఉదయ్ రైళ్లకు దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక తిరుపతి-జమ్ముతావి మధ్య నడిచే 'హమ్‌సఫర్'లో అన్ని కంపార్ట్‌మెంట్‌లు థర్డ్ క్లాస్ ఏసీతో ఉంటాయి.

సాధారణ రైలు చార్జీలతో పోలిస్తే ఇందులో టికెట్ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. రైలులో వైఫై కూడా ఉంటుంది. వారంలో ఓ రోజు తిరుపతి నుంచి బయలుదేరే ఈ రైలు మార్గం మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఇక విశాఖపట్నం-విజయవాడ మధ్య నడిచే 'ఉదయ్' డబుల్ డెక్కర్ ఏసీ రైలు.

రద్దీ మార్గాల్లో రాత్రి వేళల్లో బయలుదేరి ఉదయానికి గమ్యస్థానం చేరుకోవడంమే ఈ రైలు లక్ష్యం. అయితే విజయవాడ-విశాఖపట్నం మధ్య ఏ వేళలో తిప్పాలన్న దానిపై ఇప్పటి వరకు అధికారుల్లో స్పష్టత లేదు.
ఇక ఏపీ మీదుగా ప్రయాణించే కొత్త రైళ్లలో చెన్నై-అహ్మదాబాద్, హౌరా-యశ్వంత్‌పూర్, కామాఖ్య-బెంగళూరు, సంత్రగచ్చి-చెన్నై, హౌరా-ఎర్నాకుళం రైళ్లు ఉన్నాయి.

English summary
Railways has hiked the cost of platform tickets to Rs. 20 and the new rate will come into effect from October.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X