లోకేష్‌తో బుట్టా రేణుక భేటీ: ఎంపీ రాజమోహన్ రెడ్డి ఏమన్నారంటే..?

Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బుట్టా రేణుక తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారన్న వార్తలపై మరో ఎంపీ రాజమోహన్ రెడ్డి స్పందించారు. శనివారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా ఆమె హాజరుకాని విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే బుట్టా రేణుక టీడీపీలో చేరుతున్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది. అంతేగాక, ఆమె కర్నూలు మంత్రి లోకేష్‌ను కలడం కూడా దీనికి కలిసివచ్చింది. ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడారు.

బుట్టా రేణుక పయనం టీడీపీ వైపేనా?: లోకేష్‌తో భేటీ, జగన్ ఆగ్రహం

Rajamohan Reddy on Butta Renuka party changing issue

టీడీపీలోకి బుట్టా రేణుక చేరబోతున్నారనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. నారా లోకేష్ రాష్ట్ర మంత్రి కనుకనే ఆయనను రేణుక కలిశారని వివరణ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసం మంత్రులతో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు కలవడం సహజమేనని చెప్పారు. తాను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబును చాలా సార్లు కలిశానని రాజమోహన్ రెడ్డి తెలిపారు.

Nagarjuna Akkineni to Join YSRCP? Breaking News! | Oneindia Telugu
English summary
YSR Congress Party MP Rajamohan Reddy responded on MP Butta Renuka party changing issue.
Please Wait while comments are loading...