వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని డిజైన్లకోసం లండన్‌కు రాజమౌళి, తెలుగుదనం ఉట్టిపడేలా నమూనాలు

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Baahubali Rajamouli meets CM Naidu బాహుబలి కావాలి : రాజమౌళి తో చంద్రబాబు | Oneindia Telugu

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్ల ఖరారు విషయమై లండన్‌లోని నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో సినీ దర్శకుడు రాజమౌళి మాట్లాడనున్నారు. అక్టోబర్ 12వ, తేదిలోపుగా నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులతో రాజమౌళి మాట్లాడే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి డిజైన్ల ఎంపిక విషయమై దర్శకుడు రాజమౌళి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో బుదవారం నాడు సాయంత్రం అమరావతి సచివాలయంలో సమావేశమయ్యారు.

రాజధాని డిజైన్ల ఖరారు విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజమౌళికి కొన్ని సూచనలు చేశారు. టెక్నాలజీని ఉపయోగించుకొంటూనే తెలుగుదనం, ఏపీ రాష్ట్రానికి చెందిన చారిత్రక ప్రాభవం ఉట్టిపడేలా డిజైన్లు ఉండాలని చంద్రబాబునాయుడు సూచించారు.

మూడు దఫాలుగా మూడు గంటల పాటు సీఎంతో రాజమౌళి చర్చించారు. రాజధాని ఆకృతుల విషయంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తానని రాజమౌళి తెలిపారు. నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులతోనూ మాట్లాడతానని చెప్పారు. డిజైన్లు, రాజధాని అంశాలపై అధ్యయం చేసి మళ్లీ కలుస్తానని తెలిపారు.

Rajamouli met Chandrababu Naidu over Assembly, HC building designs

భేటీ అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఏ అంశం ప్రాతిపదికగా ఆకృతులు రూపొందించారో రాజమౌళి అడిగి తెలుసుకున్నారని చెప్పారు. అక్టోబర్‌ 12లోగా లండన్‌ ప్రతినిధులతో మాట్లాడతానని అన్నారని నారాయణ తెలిపారు.

సేవా భావంతోనే ఆకృతుల విషయంలో రాజమౌళి సాయం ఉంటుందన్నారు. ఆకృతుల విషయంలో సాయ పడేందుకు ప్రాథమిక అవగాహన, అధ్యయనం కోసం రాజధాని నగరంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారని వెల్లడించారు

English summary
Ace film director SS Rajamouli on Wednesday met Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu at the state Secretariat in Amaravati.They both held discussions on the building designs of Assembly, Secretariat and High Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X