వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ, శశికళ బంధంపై వర్మ సంచలనం: కారణం చెప్పారు, ఫస్ట్ లుక్ ఇదే!

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమిళనాడు రాజకీయాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్లతో పోరాటం చేసిన రాంగోపాల్ వర్మ..

|
Google Oneindia TeluguNews

చెన్నై/హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమిళనాడు రాజకీయాలపై ఎంతో ఆసక్తిని కనబరుస్తున్నారు. నిన్నమొన్నటి వరకు జల్లికట్టుకు వ్యతిరేకంగా ట్వీట్లతో పోరాటం చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు రాజకీయ పరిణామాలపై సంచలన ట్వీట్లు చేస్తున్నారు. తాజాగా చేసిన కొన్ని ట్వీట్లు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

గత రెండు వారాలుగా సాగుతున్న రాజకీయ హైడ్రామాకు తెరదించుతూ పళనిస్వామికి సీఎం పదవి కట్టబెట్టడంపై వర్మ సెటైర్లలో విరుచుకుపడ్డారు. అంతేగాక, ఇప్పటికే ప్రకటించిన 'శశికళ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు వర్మ.

ప్రస్తుతం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పరప్పన జైలులో శిక్షను అనుభవిస్తున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళను డాన్ గా అభిర్ణించారు. 'పళనిస్వామిని మన్నార్ గుడి మాఫియా కంట్రోల్ చేస్తున్నట్లయితే.. డాన్ శశికళ.. ప్రభుత్వాన్ని జైలు నుంచి నడుపుతున్నట్లే. ఈ సమయంలో జయలలిత స్ఫూర్తి మౌనంగా ఉండటం నాకు ఆశ్చార్యాన్ని కలిగిస్తోంది' అని పేర్కొన్నారు.

'తమిళనాడుకు చెందిన దేవుళ్లు, భక్తులు అంతా ఏం చేస్తున్నారు. మన్నార్ గుడి మాఫియాకు చెందిన డాన్ శశికళ.. తను మీకు కనీసం వ్యతిరేకించడానికి కూడా అవకాశం ఇవ్వదు' అంటూ ట్వీట్ చేశారు.

అంతేగాక, 'పోయెస్ గార్డెన్ పనివారు నాకు జయలలిత, శశికళల అనుబంధం గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. అవన్నీ నా సినిమాలు చూపిస్తా. పోయెస్ గార్డెన్ తోటమాలి చెప్పిన సమాచారం ప్రకారం.. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు శశికళకు మద్దతు తెలపడానికి కారణం.. వారంతా మన్నార్ గుడి మాఫియా నుంచి శశికళ ఎంపిక చేసిన వారే కావడం ' అంటూ రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్లు చేశారు.

English summary
Ram Gopal Varma works in mysterious ways. You can never know what is going on in his mind and what movie he may announce next. Now according to his latest posts on Twitter, the Rangeela director takes a dig at Tamil Nadu politician, Sasikala and goes on to announce a film on her…at least that’s what his Twitter timeline suggests.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X