వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగనే నా వద్దకు వచ్చారు, పార్టీలోకి రమ్మంటే నో చెప్పా: రామకృష్ణా రెడ్డి, అఖిల ఆనందం

తమ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా, తాతయ్యగా రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణా రెడ్డి అండగా ఉన్నారని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ చెప్పారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: తమ కుటుంబంలో ఒక పెద్ద దిక్కుగా, తాతయ్యగా రామకృష్ణ విద్యాసంస్థల అధినేత డాక్టర్ రామకృష్ణా రెడ్డి అండగా ఉన్నారని మంత్రి, టిడిపి నేత భూమా అఖిలప్రియ చెప్పారు.

జగన్-రోజా ఎఫెక్ట్: వేణు మాధవ్‌ను బెదిరిస్తూ ఇలా వరుస వీడియోలు!జగన్-రోజా ఎఫెక్ట్: వేణు మాధవ్‌ను బెదిరిస్తూ ఇలా వరుస వీడియోలు!

స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అఖిలప్రియ, రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడారు.

హద్దు మీరారు: 'జగన్ సెల్ఫ్ గోల్, అవే మైనస్', ఎవరో.. ఇప్పటికే క్లారిటీహద్దు మీరారు: 'జగన్ సెల్ఫ్ గోల్, అవే మైనస్', ఎవరో.. ఇప్పటికే క్లారిటీ

పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వండి

పూర్తి చేసేందుకు మరో అవకాశం ఇవ్వండి

సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి భూమా బ్రహ్మానంద రెడ్డిని నంద్యాల ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నంద్యాల ప్రజలకు కావాల్సిన అభివృద్ధి పనులన్నీ పూర్తిగా చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలన్నారు.

Recommended Video

Chandrababu Fires On TDP Leaders Over YS Jagan Matter | Oneindia Telugu
గెలిచామనే ఆనందం

గెలిచామనే ఆనందం

ప్రచారంలో వస్తున్న ఆదరణ చూస్తుంటే గెలిచామనే ఆనందం ఉందని అఖిలప్రియ అన్నారు. భారీ మెజార్టీలో గెలిపించాల్సిందే మీరే అన్నారు. 23వ తేదీ ఉదయాన్నే సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

అందుకే జగన్‌కు శాలువా కప్పా, రమ్మంటే నో చెప్పా

అందుకే జగన్‌కు శాలువా కప్పా, రమ్మంటే నో చెప్పా

వైసిపి అధినేత జగన్ ఓట్లను అభ్యర్థించడానికి తమ కళాశాలకు వస్తే మర్యాద పూర్వకంగా శాలువా కప్పినట్లు రామకృష్ణా రెడ్డి చెప్పారు. తనను పార్టీలో చేరమని జగన్ కోరారని, అందుకు సున్నితంగా నో చెప్పానని తెలిపారు.

ఆ ఛానల్ తప్పుడు వార్త

ఆ ఛానల్ తప్పుడు వార్త

కానీ ఓ ఛానల్‌లో తాను వైసిపిలో చేరినట్లు తప్పుడు వార్తను చూపించారని రామకృష్ణా రెడ్డి చెప్పారు. ఓట్లు అభ్యర్థించడానికి వారే వచ్చారని, వారే పార్టీలో చేరినట్లు రాసుకోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు.

ఎప్పటికీ భూమా కుటుంబానికే మద్దతు

ఎప్పటికీ భూమా కుటుంబానికే మద్దతు

భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తాను ఆయన కుటుంబానికే మద్దతు ఇస్తున్నాని రామకృష్ణా రెడ్డి తెలిపారు. తన జీవితాంతం భూమా నాగిరెడ్డి కుటుంబానికి మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మానంద రెడ్డిని గెలిపించాలని కోరారు.

English summary
Telugu Desam Party leader and Minister Akhila Priya on Monday said that Dr Ramakrsihna Reddy is supporting TDP and Bhuma Brahmananda Reddy in Nandyal by elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X