నంద్యాల వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైసిపి నుంచి వస్తే గ్రీన్ సిగ్నల్, టిడిపిలో అసంతృప్తి: అఖిలప్రియకు షాక్

టిడిపిలోకి చేరికలు ఎలా జరుగుతున్నాయో.. ఆధిపత్య పోరు కూడా అంతే కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, ఇదివరకు ఉన్న నేతలకు మధ్య అసలు పొసగడం లేదు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: టిడిపిలోకి చేరికలు ఎలా జరుగుతున్నాయో.. ఆధిపత్య పోరు కూడా అంతే కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, ఇదివరకు ఉన్న నేతలకు మధ్య అసలు పొసగడం లేదు. కర్నూలు జిల్లాలో ఇంతియాజ్ ఇటివలే టిడిపిలో చేరారు.

వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'? వైసీపీకి చిక్కక టీడీపీలోకి: డిసైడ్ చేసేది ముస్లింలే.. ఇదీ నంద్యాల 'రియాలిటీ'?

ఇంతియాజ్ చేరికపై ఆగ్రహం

ఇంతియాజ్ చేరికపై ఆగ్రహం

అప్పుడే అలకలు ప్రారంభమయ్యాయి. మొదటి నుంచి పార్టీలో ఉన్న తమను సంప్రదించకుండా కొత్త వారిని చేర్చుకోవడంపై అసంతృప్తి వ్యక్తమవుతున్నట్లుగా తెలుస్తోంది. నేషనల్ కాలేజీ అధినేత ఇంతియాజ్ అహ్మద్ సీఎం సమక్షంలో టిడిపిలో చేరారు.

Recommended Video

YS Jagan's Rythu Bharosa Yatra in Kurnool district - రైతు భరోసా యాత్రలో జగన్ - Oneindia Telugu
అఖిలప్రియ ప్రయత్నాలు విఫలం

అఖిలప్రియ ప్రయత్నాలు విఫలం

ఆయన చేరికపై తమను స్థానిక నేత రామకృష్ణా రెడ్డి అలిగినట్లుగా ప్రచారం సాగుతోంది. ఆయనను బుజ్జగించేందుకు అఖిలప్రియ చేసిన ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. దీంతో సీఎం చంద్రబాబు ఏవీ సుబ్బారెడ్డిని రంగంలోకి దింపాలని చూసింది. కానీ ఏవీ సుబ్బారెడ్డి ఇందుకు నిరాకరించారని కూడా ప్రచారం సాగుతోంది.

అఖిలప్రియపై సొంత పార్టీ నేతల ఆగ్రహం

అఖిలప్రియపై సొంత పార్టీ నేతల ఆగ్రహం

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఇటీవల పలువురు నేతలు టిడిపిలో చేరుతున్నారు. అయితే, తమకు తెలియకుండా మంత్రి అఖిలప్రియ వాటికి పచ్చ జెండా ఊపుతున్నారని కొందరు ఆమెపై అసహనంతో, ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తోంది. రామకృష్ణా రెడ్డిని బుజ్జగించేందుకు ఆమె ప్రయత్నించినా, ఆయన చల్లబడలేదని అంటున్నారు.

అందుకే ఏవీ సుబ్బారెడ్డి కూడా

అందుకే ఏవీ సుబ్బారెడ్డి కూడా

రామకృష్ణా రెడ్డిని బుజ్జగించేందుకు ఏవీ సుబ్బారెడ్డి అంగీకరించకపోవడానికి కారణం ఉందంటున్నారు. ఆయన కూడా అధిష్టానం పట్ల అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు.

English summary
It is said that Telugu Desam Nandyal Leader Ramakrishna Reddy unhappy with Party High Command for Imtiyaz joining in party. Minister Akhila Priya is trying to woo him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X