వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెండేళ్ళు జైల్లో ఉన్నా, పార్టీ మారే ఆలోచన రాలేదు: రామసుబ్బారెడ్డి

రెండేళ్ళపాటు జైల్లో ఉన్నా కానీ, తనకు పార్టీ మారాలనే ఆలోచన రాలేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో కూడ పార్టీ మారే ఆలోచన రాదని ఆయన ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుండి పా

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: రెండేళ్ళపాటు జైల్లో ఉన్నా కానీ, తనకు పార్టీ మారాలనే ఆలోచన రాలేదని మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రకటించారు. భవిష్యత్తులో కూడ పార్టీ మారే ఆలోచన రాదని ఆయన ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే ఉన్నానని చెప్పారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీలోనే కొనసాగుతున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

ఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులుఆది ఎఫెక్ట్‌తో రామసుబ్బారెడ్డికి, బైపోల్‌తో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవులు

టిడిపి సీనియర్ నాయకులు మాజీ మంత్రులు రామసుబ్బారెడ్డి, ఎన్ఎండి ఫరూక్‌లకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఎమ్మెల్సీలుగా బుదవారం నాడు వారిద్దరూ ప్రమాణం చేశారు.

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కుటుంబం తొలి నుండి టిడిపిలోనే ఉంది. రామసుబ్బారెడ్డికి ఆయన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డి కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ గొడవలున్నాయి.

Recommended Video

TDP Senior Leader Shilpa Mohan Reddy Announced Date to Join YSRCP | Oneindia Telugu

అయితే ఆదినారాయణరెడ్డి వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే ఆది నారాయణరెడ్డి టిడిపిలో చేరడాన్ని రామసుబ్బారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. అంతేకాదు ఆయనకు మంత్రి పదవి ఇవ్వడాన్ని కూడ ఆయన జీర్ణించుకోలేదు. దీంతో రామసుబ్బారెడ్డిని సంతృప్తిపర్చేందుకుగాను టిడిపి నాయకత్వం చర్యలను తీసుకొంది.

ఈ మేరకు గత మాసంలో ఏపీ సిఎం చంద్రబాబుతో రెండురోజులపాటు సమావేశమైన రామసుబ్బారెడ్డికి హమీ లభించింది. ఎమ్మెల్సీ పదవిని ఇవ్వనున్నట్టు బాబు ఆయనకు హమీ ఇచ్చారు. ఈ మేరకు ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కింది. నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. వీరిద్దరి ప్రమాణ స్వీకారంలో ఏపీ టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావుతో పాటు పార్టీ ముఖ్కులు పాల్గొన్నారు.

రెండేళ్ళు జైల్లో ఉన్నా పార్టీ మారాలనే ఆలోచనే రాలేదు

రెండేళ్ళు జైల్లో ఉన్నా పార్టీ మారాలనే ఆలోచనే రాలేదు

రెండేళ్ళపాటు తాను జైల్లో గడిపాను. అయినా కానీ, తనకు పార్టీ మారాలనే ఆలోచనే రాలేదని, భవిష్యత్తులో కూడ రాదన్నారు ఎమ్మెల్సీ , మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి. తన బాబాయిని హత్య చేసిన నిందితుల హత్యకేసులో మంత్రిగా ఉన్న రామసుబ్బారెడ్డిపై కోర్టు శిక్ష విధించింది.దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసి రెండేళ్ళపాటు జైల్లో గడిపారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబునాయుడు సిఎంగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత రామసుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు.

పాతకాపులకు ఎమ్మెల్సీ పదవులు

పాతకాపులకు ఎమ్మెల్సీ పదవులు

పార్టీ సీనియర్లు, మాజీ మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న రామసుబ్మారెడ్డి, ఎన్ఎండి ఫరూక్‌లకు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు వీరిద్దరికి ఎమ్మెల్సీ పదవులను ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు. గవర్నర్ కోటాలో వారిద్దరిని నామినేట్ చేయాలని తీర్మాణం చేశారు.ఈ తీర్మాణం కాపీని గవర్నర్‌కు పంపారు. వారిని ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకొన్నారు. మంగళవారం నాడు మండలి వైఎస్ ఛైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం ప్రమాణం చేయించారు.

కలిసొచ్చిన కాలం

కలిసొచ్చిన కాలం

2014 ఎన్నికల్లో జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుండి రామసుబ్బారెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగారు. ఈ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిని ఆదినారాయణరెడ్డి చేతిలో ఆయన ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ స్థానం నుండి ఫరూక్ ఎంపిగా పోటీచేశారు. అయితే ఆయన ఈ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ స్థానం నుండి అసెంబ్లీ స్థానం నుండి కాంగ్రెస్ నుండి టిడిపిలో చేరిన శిల్పా మోహన్‌రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే శిల్పాతో పాటు, ఫరూక్ కూడ ఓటమిపాలయ్యారు. అయితే ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మంత్రి పదవిని ఇవ్వడంతో రామసుబ్బారెడ్డికి, నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవుల దక్కాయి.

సరైన సమయంలో పదవులు

సరైన సమయంలో పదవులు

నంద్యాల ఉప ఎన్నికలను పురస్కరించుకొని ఆ స్థానంలో అత్యధికంగా ఉన్న మైనార్టీల ఓట్లను తమ వైపుకు తిప్పుకొనేందుకుగాను టిడిపి వ్యూహత్మకంగా అడుగులు వేసింది.ఈ మేరకు ఫరూక్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. భూమా వర్గానికి మద్దతుగా ఉన్న ఫరూక్‌కు సరైన సమయంలోనే ఈ పదవిని ఇచ్చారని విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

50 వేల మెజారిటీతో నంద్యాలలో విజయం

50 వేల మెజారిటీతో నంద్యాలలో విజయం

నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి అభ్యర్థే దొరకలేదు. టిడిపి నుండి వచ్చిన వ్యక్తికి టిక్కెట్టు ఇచ్చారని ఎమ్మెల్సీ ఫరూక్ అన్నారు. ఈ ఉప ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి భూమా బ్రహ్మనందరెడ్డి 50వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

English summary
Former ministers Ramasubba reddy, NMD Farooq swearing as Mlas on Wednesday at Amaravati.Ap governament nominated them as Mlc's in Governor quota.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X