వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాట్లాడితే బాబుకు కోపం, చెప్పుతో కొడతారు: ఊగిపోయిన రాయపాటి, అదే చెప్పాలని జేసీ

టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు రైల్వే అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో భేటీ జరిగింది. ఈ సమావేశం మధ్యలోనే రాయపాటి అసంతృప్తితో బయటకు వచ్చారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: టిడిపి ఎంపీ రాయపాటి సాంబశివ రావు మంగళవారం నాడు రైల్వే అధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో భేటీ జరిగింది. ఈ సమావేశం మధ్యలోనే రాయపాటి అసంతృప్తితో బయటకు వచ్చారు. అనంతరం ఆయన మాట్లాడారు.

బాబు అమెరికా టూర్‌పై జగన్ పార్టీ పక్కా ప్లాన్‌తో..?: ఎవరో తెలిసిందంటూ..!బాబు అమెరికా టూర్‌పై జగన్ పార్టీ పక్కా ప్లాన్‌తో..?: ఎవరో తెలిసిందంటూ..!

చెప్పుతో కొడతారు

చెప్పుతో కొడతారు

రైల్వే అధికారులు చిన్న చిన్న పనులు కూడా చేయడం లేదని రాయపాటి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా అయితే ప్రజలు తమను చెప్పులతో కొడతారని వ్యాఖ్యానించారు. భోజనం, టిక్కెట్ కోసం సమావేశాలకు వస్తారా అని మండిపడ్డారు.

నేను మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుంది కానీ

నేను మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుంది కానీ

తాను మాట్లాడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కోపం వస్తుందని రాయపాటి అన్నారు. అయినప్పటికీ తాను మాట్లాడుతానని చెప్పారు. రైల్వే అధికారులు ప్రధాని కన్నా పవర్ ఫుల్ అని వ్యాఖ్యానించారు.

ముందు రైల్వే జోన్ ప్రకటిస్తే..

ముందు రైల్వే జోన్ ప్రకటిస్తే..

విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు తొలుత రైల్వేజోన్ రావాల్సి ఉందని రాయపాటి అన్నారు. రైల్వే జోన్ రాకపోవడానికి అధికారులే కారణమని చెప్పారు. ముందు రైల్వే జోన్ వస్తే ఆ తర్వాత మెల్లిగా విశాఖకు మార్చుకోవచ్చునని చెప్పారు. లేదంటే కొన్నాళ్లకు విశాఖ జోన్ కూడా మరిచిపోతారన్నారు.

వాటి గురించి అడిగితే..

వాటి గురించి అడిగితే..

రైల్వే అధికారులతో భేటీ సమయంలో తాను పలు సమస్యలపై అఢిగానని చెప్పారు. దానికి సమాధానం లేదని అభిప్రాయపడ్డారు. గుంటూరు - తెనాలి డబ్లింగ్ పనులు పదేళ్లుగా జరుగుతున్నాయన్నారు. గుంటూరు - చెన్నై డే టైమ్ ట్రెయిన్ అడిగానని చెప్పారు.

రైల్వే అధికారులతో భేటీ అనంతరం..

రైల్వే అధికారులతో భేటీ అనంతరం..

రైల్వే అధికారులతో భేటీ అనంతరం తోట నర్సింహం మాట్లాడారు. రైల్వే జోన్ వస్తుందన్నారు. ఏపీ నుంచి రైల్వే మంత్రి ఎంపిక కావడంతో ఫలితాలు వస్తున్నాయన్నారు. కోస్టల్ కారిడార్‌ను రైల్వే శాఖ అభివృద్ధి చేయాలన్నారు.

అధికారులు ఏం చేయగలరో దానినే చెప్పాలని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అన్ని అంశాలపై పర్యవేక్షణకు ఓ అధికారిని నియమించాలని ఆయన సూచించారు.

English summary
MP Rayapati Sambasiva Rao shocking comments on Railway officers. He said they are not completing any work.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X