వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోలింగ్ టర్నవుట్: 'గెలుపు తేలిపోయింది, శిల్పా మోహన్ రెడ్డిదే నంద్యాల!'

నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే గౌరు చరిత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఎమ్మెల్యే గౌరు చరిత, ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. టిడిపి తేలిపోయిందని, భారీ మెజార్టీతో వైసిపి గెలుపు ఖాయమని తేలిందన్నారు.

శిల్పా మోహన్ రెడ్డి గెలుస్తారని ధీమా

శిల్పా మోహన్ రెడ్డి గెలుస్తారని ధీమా

అనుమతులు లేకున్నా పోలింగ్‌ కేంద్రాల వద్దకు టిడిపి నాయకులు యథేచ్ఛగా వెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. అధికార పార్టీకి ఓ న్యాయం, ప్రతిపక్షానికి ఓ న్యాయమా అని ప్రశ్నించారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్‌ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని గౌరు ధీమా వ్యక్తం చేశారు.

Recommended Video

Nandyal By-Election : Lagadapati Rajagopal Gives Clarity After Polling | Oneindia Telugu
భారీ ఓటింగ్‌తో టిడిపిలో భయం

భారీ ఓటింగ్‌తో టిడిపిలో భయం

నంద్యాల ఉప ఎన్నికల్లో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని వైసిపి అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అన్నారు. భారీగా ఓటింగ్‌ నమోదు కావడంతో టిడిపికి ఓటమి భయం పట్టుకుందన్నారు.

మేం ఓపిగ్గా ఉన్నాం

మేం ఓపిగ్గా ఉన్నాం

టిడిపి ఓటమి భయంతోనే దాడులకు తెగబడిందని, ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనంగా ఉంటున్నట్లు శిల్పా మోహన్ రెడ్డి తెలిపారు. ఓటింగ్‌ రోజున కూడా ఓటర్లను మభ్యపెట్టడానికి టిడిపి ప్రయత్నించిందని ఆరోపించారు.

మాటల ఫ్లోలో జగన్ అలా అన్నారు

మాటల ఫ్లోలో జగన్ అలా అన్నారు

ఓటర్లను మభ్య పెట్టేందుకు స్వయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారని శిల్పా మోహన్ రెడ్డి ఆరోపించారు. జగన్‌పై కేసు నమోదుపై శిల్పా స్పందించారు. ఆరోపణలు చేసినప్పుడు ప్రతి ఆరోపణలు ఉంటాయన్నారు. మాటల ఫ్లోలో జగన్‌ అలా మాట్లాడారన్నారు. అయితే న్యాయం తమవైపు ఉంటుందన్నారు.

టిడిపి ఎన్ని కుట్రలు చేసినా

టిడిపి ఎన్ని కుట్రలు చేసినా

ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించిందని శిల్పా కితాబిచ్చారు. టిడిపి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు శిల్పా సోదరుల వైపు సైనికుల్లా పని చేశారని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

భారీ పోలింగ్

భారీ పోలింగ్

కాగా, నంద్యాల ఉప ఎన్నిక ప్రక్రియలో చివరి ఘట్టమైన పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 79.20% ఓటింగ్ జరిగింది. ఈ నెల 28న ఓట్ల లెక్కింపులో నంద్యాల శాసన సభ్యునిగా ఎన్నికయ్యే నాయకుడు ఖరారు కానున్నారు.

1983 నుంచి ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్

1983 నుంచి ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్

నంద్యాల నియోజకవర్గంలో 1983 నుంచి ఇప్పటి వరకు అత్యధిక పోలింగ్‌ శాతం నమోదైంది. పలు గ్రామాల్లో 90 శాతం పోలింగ్‌ కావడం గమనార్హం. ఇక గెలుపు తమదేనని టిడిపి,వ ైసిపిలు ధీమాను వ్యక్తం చేస్తున్నాయి.

English summary
The hotly-contested by-election to Nandyal Assembly constituency witnessed a record 79.2 percent polling on Wednesday. Polling was by and large peaceful barring stray incidents of violence involving TDP and YSRC activists. Enthusiastic voters turned up at the polling stations since early morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X