వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపి వర్సెస్ తెలంగాణ: ఎర్రబస్సు తగాదా, ఎపి విద్యార్థుల ఆందోళన

By Pratap
|
Google Oneindia TeluguNews

ఏలూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదం చోటు చేసుకుంది. ఆర్టీసికి సంబంధించిన ఇరు రాష్ట్రాల మధ్య సమస్యలను పరిష్కరించడంలో ఆలస్యం కారణంగా తగాదాలు చోటు చేసుకుంటున్నాయి. అది పశ్చిమగోదావరి జిల్లాలోని 300 మంది విద్యార్థులకు ఇది సంకటంగా మారింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆర్టీసి సర్వీసుల్లో ఏపీ విద్యార్థుల పాస్‌లను అనుమతించడం లేదు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎపిఎస్ఆర్టీసి) తగినంత రుసుం వసూలు చేసి పాస్‌లు జారీ చేసింది. చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన విద్యా ర్థులు సుదీర్ఘ కాలంగా ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, అశ్వారావుపేట విద్యా సంస్థల్లో చదువుకుంటున్నారు.

తాజాగా ఆర్టీసీ విభజన తరువాత తెలంగాణ ఆర్టీసీబస్సుల్లో ఏపీవిద్యార్థుల పాస్‌లనునిలిపివేశారు.స త్తుపల్లి-చింతలపూడి మధ్య ప్రయాణించే బస్సులన్నింటిల్లోనూ విద్యార్థులు ఎక్కడానికి వీలులేదని ఆంక్షపెట్టారు. గడిచిన నెలంతా పాఠశాలలు తెరిచిన దగ్గర నుంచి ఈ వి వాదం కొనసాగుతూనే ఉంది.

Red bus rift between Telangana and Andhra Pradesh

రాఘవాపురం నుంచి సత్తుపల్లి వెళ్ళాల్సిన విద్యార్థులంతా రోడ్డు మీదికి వచ్చారు. మూడు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే తమ నిబంధనలు తమకు ఉన్నాయని, రాఘవాపురం దాటిన తరువాత వెంటనే తెలంగాణ రాష్ట్ర సరిహద్దు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతానికి చెందిన విద్యార్థుల పాస్‌లు చెల్లవని అంటున్నారు.

మరోవైపు, జీలుగుమిల్లి నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉన్న అశ్వారావుపేటకు కూడా విద్యార్థులను అనుమతించడంలేదు. దీంతో స్థానిక నేతలు గుర్రుమన్నారు. తమ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్న తెలంగాణ ఆర్టీసీ ఈ ప్రాంతానికి సర్వీసులు నడపక్కర్లేదని రెండు రోజుల క్రితమే సత్తుపల్లి డిపో బస్సులను వెనక్కి తిప్పి పంపారు.

English summary
Andhra Pradesh students are facing problem as Telangana RTC buses are not allowing passes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X