వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హరీష్ చాకు కాదు, చురకత్తి: రేవంత్, బాబుపై జగదీష్ ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం తెలంగాణ నేత రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావు చాకు కాదు, చురకత్తని ఆయన విమర్శించారు.ఏదో ఒక రోజు కేసీఆర్‌కు హరీష్‌రావు వెన్నుపోటు పొడుస్తారని ఆయన హెచ్చరించారు.

సోమవారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో మాట్లాడుతూ కెసిఆర్ - తెలంగాణ రాష్ట్రంలోని నీటి పారుదుల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయని, హరీష్ చాకులా పనిచేస్తున్నాడని అన్నారు. దానికి ప్రతిగానే రేవంత్ రెడ్డి మంగళవారంనాడు ఆ వ్యాఖ్య చేశారు.

కేసీఆర్‌పై రైతులకు నమ్మకం లేదు కనుకనే వ్యవసాయ పనులు ప్రారంభించలేదని రేవంత్ రెడ్డి అన్నారు వ్యవసాయం పడకేయడం వల్లే విద్యుత్‌ కోతలు లేవు తప్ప కేసీఆర్ ఘనకార్యం కాదని ఆయన అన్నారు మిషన్‌ కాకతీయ కమీషన్‌ కాకతీయగా మారిందని రేవంత్‌ ఆరోపించారు.

Revanth reddy comments on Harish Rao

ఇదిలావుంటే, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇతర పార్టీల నేతలను సంతలో పశువుల్లానే కొనుగోలు చేశారా? అని తెలంగాణ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. మనుషులను కొనుగోలు చేయడం చంద్రబాబుకే అలవాటని ఆయన అన్నారు.

ఇతరులను ప్రశ్నించే ముందు చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వ మంచిపనులు చూసి ఆకర్షితులైన వారే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆయన చెప్పారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్‌కు రైతుల గురించి తెలిస్తే ప్రతిపక్ష హోదా ఎందుకు దక్కలేదని మంత్రి ప్రశ్నించారు.

సికింద్రాబాద్ కవాతు మైదానంలో తమ టిఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహరంగ సభకు హాజరై తిరిగి వెళ్తుండగా పలువురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలను, క్షతగాత్రులను ఆదుకుంటామని ఆయన చెప్పారు. టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలపై, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తామని ఆయన చెప్పారు.

English summary
Referring Telangana CM and Telangana Rastra samithi (TRS) president K chandrasekhar Rao statement made at Secendurabad parade grounds public meeting, Telangana Telugudesam (TDP) leader Raventh Reddy made a comment on minister Harish Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X