వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రిషికేశ్వరి కేసులో కీలక సమాచారం! తండ్రి ఆవేదన, సమాధానం లేని ప్రశ్నలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

గుంటూరు: రిషికేశ్వరి మృతిలో ప్రభుత్వం నియమించిన కమిటీ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సమాచారం సేకరిస్తోంది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో కమిటీ బుధవారం విచారణ ప్రారంభించింది. గురువారం రెండో రోజు.

ఇందులో భాగంగా విద్యార్థులు, అధ్యాపకులు, విశ్వవిద్యాలయంకు సంబంధించిన ఇతర సభ్యులతో సమావేశమైంది. రిషికేశ్వరి తండ్రి విచారణ కోసం వర్సిటీకి వచ్చారు.

విచారణాధికారి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. విచారణను అవసరమైతే మరో రెండు రోజులు పొడిగిస్తామని చెప్పారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అధికారులతో మాట్లాడి కొంత కీలక సమాచారం సేకరించామని ఆయన చెప్పారు.

గురువారం మధ్యాహ్నం నుంచి రిషికేశ్వరి తల్లిదండ్రులతో మాట్లాడుతామని చెప్పారు. ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే నేరుగా కలవవచ్చునని చెప్పారు.

రెండో రోజు విచారణకు పిడిఎస్‌యు, ఎంఎస్ఎఫ్ ప్రతినిధులు హాజరయ్యారు. విశ్వవిద్యాలయానికి సెలవులు ప్రకటించి విద్యార్థులు ఎవరు లేకుండా విచారణ పేరుతో అధికారులు పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని కొందరు ఆరోపించారు.

 Rishikeshwari suicide: Committee enquiring

రిషికేశ్వరి తండ్రి ఆవేదన

రిషికేశ్వరిలేని జీవితమే తమకు లేదని, తనలాంటి పరిస్థితి ఏ తండ్రికి రావొద్దని రిషికేశ్వరి తండ్రి అన్నారు. తన కూతురు మరణానికి కారణమైన వారందర్నీ శిక్షించాలన్నారు. నాగార్జున విశ్వవిద్యాలయంలో మనిషి చనిపోయేంతగా ర్యాగింగ్ రూపంలో రాక్షసత్వం ఉందన్నారు.

కొందరు విద్యార్థులు ప్రిన్సిపల్‌కు దగ్గరగా ఉంటున్నారని, వారు ఏం చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఎంత ధైర్యవంతురాలైనప్పటికీ పుకార్ల విషయంలో మనోధైర్యం కోల్పోతారన్నారు. విశ్వవిద్యాలయం యాజమాన్యం ఇప్పటికైనా సరిదిద్దుకోవాలన్నారు.

రిషికేశ్వరి ఉదంతంలో సమాధానం లేని ప్రశ్నలు అంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి!

ఉరి వేసుకొని వేలాడుతున్న రిషికేశ్వరిని కిందకు దించిందెవరు?
హాస్టల్లో ఉన్న తోటి విద్యార్థునుల కంటే ముందు బాయ్స్ హాస్టల్‌కు ఎలా చేరింది?
ఆమెను మొదట చూసింది ఎవరు?
బాబురావుకు ఎందుకు ఫోన్ చేశారు?
హాస్టల్ వార్డెన్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదు?
ఉరివేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా?
బాబురావు సస్పెన్షన్‌కు ముందుగానే రాజీనామా ఎందుకిచ్చాడు?
బాబురావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు?
ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది?
రిషికేశ్వరి వేధింపులపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?
విశ్వవిద్యాలయానికి పదిరోజులు సెలవు ఎందుకిచ్చారు?

English summary
Committee enquiring students, university officials in Rishikeshwari suicide case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X