వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్షమాపణ చెప్పేది లేదు.. క్లిప్పింగ్స్ ఉంటే బయటపెట్టండి: రోజా తేల్చేసింది..

తాను ఏ తప్పూ చేయలేదని, ఎందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తనపై చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన అసలైన వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టాలని,

|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఓవైపు టీడీపీ నేతలంతా రోజా క్షమాపణలు చెప్పాల్సిందేనని పట్టుబడుతుంటే.. రోజా మాత్రం ససేమిరా అని తేల్చి చెబుతోంది. ఈ ఉదయం అసెంబ్లీ సమావేశమైన సమయంలో రోజా మీడియాతో మాట్లాడారు.

తాను ఏ తప్పూ చేయలేదని, ఎందుకు క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. తనపై చేస్తోన్న ఆరోపణలకు సంబంధించిన అసలైన వీడియో క్లిప్పింగ్స్ బయటపెట్టాలని, అలా అయితేనే వాస్తవాలు వెలుగుచూస్తాయని ఆమె స్పష్టం చేశారు. అసెంబ్లీ వీడియో క్లిప్పింగ్స్ దొంగిలించిన కాల్వ శ్రీనివాసులుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

{image-roja-new-534-21-1461220819-07 1488869069.jpg telugu.oneindia.com}

గతంలో తాను చేసిన వ్యాఖ్యలను వారికి అవసరమైన చోట కట్ చేసి దాన్ని ఓ వీడియో లాగా చేశారని రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన వీడియో క్లిప్పింగ్స్ బయటపెడితేనే.. వాస్తవాలు బయటకొస్తాయని, అప్పుడు కూడా తాను తప్పు చేశానని తేలితే.. రెండేళ్లు కాదు, మూడేళ్ల సస్సెన్షన్ కు కూడా తాను సిద్ధమేనని రోజా వ్యాఖ్యానించారు.

మరోవైపు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ఉదయం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే అనితకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సభాపతి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

యనమల వ్యాఖ్యలను ప్రస్తావించకపోయినా.. క్షమాపణలు చెప్పేది లేదని రోజా తేల్చి చెప్పడంతో.. మరోసారి రోజాపై వేటు తప్పదా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అనిత ఫిర్యాదు మేరకు రోజా క్షమాపణలకు సంబంధించి సభా హక్కుల కమిటీ ఇప్పటికే నివేదిక రూపొందించిందని యనమల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సభలో రోజాపై మరోసారి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.

English summary
YSRCP MLA Roja made a clear statement that she never say apology to TDP MLA Anita. On this morning TDP Minister was demanded for apology
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X