వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వదినకు వెన్నుపోటు: దేవినేనిపై రోజా, 'యూపీ తీగ లాగితే జగన్ డొంక కదిలింది'

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ఎద్దేవా చేశారు.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రారంభిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోటోలకు ఫోజులు ఇస్తున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే రోజా గురువారం నాడు ఎద్దేవా చేశారు.

అక్కడే డౌట్!: బాబుపై చిరంజీవి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?అక్కడే డౌట్!: బాబుపై చిరంజీవి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారా?

ప్రాజెక్టుల పేరుతో కోట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబు సొంత మామకు వెన్నుపోటు పొడిచారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు తన వదినకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

మాయావతి సోదరుడి సంస్థకు జగన్ జగతికి లింక్: పయ్యావుల

మన దేశంలో నల్ల ధనం మూలాలు ఎక్కడ బయటపడినా అందులో వైసిపి అధినేత జగన్ పేరు వినిపిస్తోందని టిడిపి నేత పయ్యావుల కేశవ్ అన్నారు. యూపీ మాజీ సీఎం మాయావతి సోదరుడు ఆనంద్ కుమార్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలే జగన్‌కు చెందిన జగతిలో పెట్టారన్నారు.

ఆనంద్ కుమార్ జమ చేసిన రూ.104 కోట్ల పైన ఐటీ శాఖ విచారణ జరిపిందని, హింగోరా ఫిన్ వెస్ట్, భాస్కరా ఫండ్స్ మేనేజ్‌మెంట్స్, డెల్టాన్, ఎగ్జిమ్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీలు ఆనంద్ సంస్థల్లో రూ.1300 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు తేలిందన్నారు.

నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!నిజమా.. నువ్వేనా :చిరంజీవిని సర్‌ప్రైజ్ చేసిన రోజా, అందరికీ షాక్!

రూ.10 షేర్‌ను రూ.10వేల చొప్పున కొన్నాయన్నారు. ఈ నల్లధనం మూలాలను ఐటీ పరిశీలించిందని, అప్పుడు హింగోరా సంస్థ జగతిలోని పెట్టుబడులు పెట్టినట్లుగా తేలిందన్నారు. ఆనంద్ కుమార్ అవినీతిపై తీగ లాగితే జగన్ అక్రమాల డొంక కూడా కదిలిందన్నారు.

English summary
YSRCP MLA Roja takes on CM Chandrababu Naidu and Minister Devinini Umamaheswara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X