గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లక్ష: ఏపీలో భూ రిజిస్ట్రేషన్‌కు పాన్ కార్డు తప్పనిసరి

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ. లక్షకు పైగా విలువ కలిగిన భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పాన్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి చెప్పారు. బుధవారం ఆయన మీడియా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పాస్ పుస్తకాల జారీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు.

త్వరలోనే ఈ పాస్ పుస్తకాల జారీ కోసం ఈటీఎస్ మిషన్లు ఇవ్వనున్నట్లు ఆయన చెప్పారు. మండల తహసీల్దార్లకు కొత్త వాహనాలు సమకూర్చడంతో పాటు దెబ్బతిన్న కార్యాలయ భవనాల స్ధానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని చెప్పారు.

Rs. 1 lakh above land registrations pan card is mandatory

ఇక ఏప్రిల్ 25న నేపాల్‌లో సంభవించిన భూకంపంలో దెబ్బతిన్న పశుపతి నాథ్ ఆలయ పునరుద్ధరణకు తన వంతుగా రూ. 2 లక్షల విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన చెప్పారు.

విశాఖలో అదుపుతప్పి లోయలో పడిన జీపు

విశాఖ జిల్లాలోని గూడెంకొత్తవీధి మండలం జరల ఘాట్ రోడ్డులో ప్రయాణీకులతో వెళుతోన్న జీపు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న స్ధానికులు వెంటనే 108కి ఫోన్ చేశారు. దీంతో సంఘటనా స్ధలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను అంబులెన్స్‌లో చింతపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

English summary
Andhra Pradesh Deputy Cheif minister KE Krishna murthy says rs. 1 lakh above land registrations pan card is mandatory.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X