గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కబడ్డీ ఆడారు: రొడ్డెక్కని బస్సులు, ప్రయాణీకులకు తిప్పలు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేతన సవరణ కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు ముగిసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో బుధవారం దాదాపు 20 వేల బస్సులు రోడ్డెక్కలేదు.

దీంతో హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్, జేబీఎస్, ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం బస్ స్టేషన్ల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికుల సౌకర్యార్ధం ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో విజయవంతం కాలేదు.

కాకపోతే కొంతమేరకు ఉపశమనాన్ని కలిగించింది. మొత్తం మీద ఆర్టీసీ తొలి రోజు సమ్మె తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్టీసీ సంస్ధ ప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించి, సహకరించాలని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు విజ్ఞప్తి చేసినా కార్మికులు పట్టించుకోలేదు.

కార్మిక సంఘాలను చర్చలకు రావాలని పిలుపునిచ్చినా, ఫిట్‌మెంట్ తేలేవరకు సమ్మెను ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఆర్టీసీ సమ్మెతో ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వాహనదారులు ప్రయాణీకులను నిలువుదోపిడీ చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో రైళ్లలో రద్దీ పెరిగింది.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

విశాఖ పట్నంలోని 9 డిపోల్లోని 1050 బస్సులు నిలిచిపోయాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కూడా ఒకటి, రెండు సర్వీసులు మినహా అనుకున్న స్థాయిలో అధికారులు బస్సులను నడపలేకపోయారు.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

విశాఖ నగరంలో సిటీ సర్వీసులు కూడా సక్రమంగా నడపలేకపోయారు. కేవలం పదుల సంఖ్యలో బస్సులను నడిపి ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకున్నారు. సమ్మెను దృష్టిలో పెట్టుకొని విశాఖ జిల్లాలో 150 బస్సు సర్వీసులు నడిపినట్టు ఆర్టీసీ ఆర్‌ఎం జగదీష్ ప్రసాద్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడాయి. ఖాళీ దొరక్క పోవడంతో రైలులో నిల్చోనే ప్రయాణిస్తున్న ప్రయాణికులు. అసలే పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఊళ్లకు వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

దీంతో దూర ప్రాంతాలకు కూడా ఆటోలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఆటోవాలాలు కూడా ఇదే అదునుగా రెట్టింపు ఛార్జీలను వసూలు చేశారు.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

ఇక రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. తాత్కాలిక ఉద్యోగులతో బస్సులు నడిపేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసి బస్సు సర్వీసులు తిరగలేదు. జిల్లాలోని 12 డిపోల్లో 942 బస్సు సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. దీంతో ఒక్కరోజే రూ.94.7 లక్షల ఆదాయం నష్టపోయింది.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

కర్నూలు జిల్లాలోని 12 డిపోల్లో 986 సర్వీసులు డిపోలకే పరిమితమయ్యాయి. ఒకటి, రెండు బస్సులను డిపోల నుంచి అధికారులు బయటకు పంపినా కొద్ది దూరంలో సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడే నిలిచిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

కడప జిల్లాలో సైతం బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. జిల్లాలోని 8 డిపోల్లో మొత్తం 925 సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీకి రూ.కోటికి పైగా నష్టం వాటిల్లింది. ఆయా డిపోల ఎదుట కార్మికులు నిరసనలు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

కృష్ణా జిల్లాలోని 14 డిపోల్లో 1,033 బస్సులు ఉండగా వాటిలో 148 హైర్ బస్సులు, 33 ఆర్టీసీ బస్సులు తిప్పామని కృష్ణా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధేష్ కుమార్ తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

గుంటూరు జిల్లాకు సంబంధించి మొత్తం 12 డిపోలకు గాను 1,060 బస్సులు ఉండగా మొత్తం 222 బస్సులు తిప్పామని ఆర్టీసీ గుంటూరు రీజనల్ మేనేజర్ రామారావు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

వేతన సవరణ కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు ముగిసింది. దీంతో నిర్మానుష్యంగా మారిని హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ బస్ స్టేషన్‌లో కబడ్డీ ఆడుకుంటున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, కండెక్టర్లు. వేతన సవరణ కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు ముగిసింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

వేతన సవరణ కోరుతూ తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె తొలిరోజు ముగిసింది. తెలంగాణలో రోజు 10, 705 సర్వీసులు నడువాల్సి ఉండగా బుధవారం 342 మాత్రమే నడిచాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

మొత్తం మీద ఆర్టీసీ తొలి రోజు సమ్మె తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. నిర్మానుష్యంగా మారిన సికింద్రాబాద్‌లోని రైల్వే స్టేషన్ ప్రాంగణం.

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

మొత్తం మీద ఆర్టీసీ తొలి రోజు సమ్మె తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. బస్సులు లేకపోవడంతో రోడ్లపైనే ఆటోల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణీకులు.

 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రభావం

మొత్తం మీద ఆర్టీసీ తొలి రోజు సమ్మె తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. సెంట్రల్ బస్ స్టేషన్‌లో కర్ణాటక బస్సులు నిలుపు స్ధలం.

English summary
The bandh call given by Andhra Pradesh State Road Transport Corporation Employees Union (APSRTC-EU) and Telangana Mazdoor Union (TMU), hampered the regular bus services starting with the first one on Wednesday across both Andhra Pradesh and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X