వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి కాకా కన్నుమూత

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వెంకటస్వామి సోమవారం రాత్రి మరణించారు. హైదరాబాద్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. రాజకీయ నాయకులకు చిరపరిచితుడైన వెంకటస్వామి లోక్‌ సభకు ఏడుసార్లు ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చూసి కన్నుమూస్తానని చెప్పిన వెంకటస్వామి తన మాట నిలబెట్టుకున్నారు. హైదరాబాదులోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన సోమవారం రాత్రి 8 గంటల 40 నిమిషాల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు 85 ఏళ్ల వయస్సు.

కాకాగా ముద్దుగా పిలుచుకునే వెంకటస్వామి 1929 అక్టోబర్ 5వ తేదీన సికింద్రాబాదులో జన్మించారు. 1967లో తొలిసారి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి నుంచి ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. ఇందిరా గాంధీ, పివి నర్సింహారావు ప్రభుత్వాల్లో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారు. మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటస్వామి ప్రభుత్వ హయాంల్లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు.

G Venkataswami

కాంగ్రెసు అత్యున్నత నిర్ణాయక సంస్థ సిడబ్ల్యుసిలో కూడా ఆయన ఉన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుమారులు వివేక్, వినోద్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. మాజీ మంత్రి పి. శంకర రావు ఆయన పెద్దల్లుడు. 1969 తెలంగాణ ఉద్యమంలో ముషీరాబాద్ జైలు వద్ద జరిగిన కాల్పుల్లో వెంకటస్వామి గాయపడ్డారు. తాను స్థాపించిన విద్యాసంస్థను ఆయన ఒక్క రూపాయి డొనేషన్ కూడా తీసుకోకుండా నిర్వహిస్తున్నారు

1957-62, 1978 - 84ల్లో ఆయన శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 1967లో మొదటిసారి లోకసభకు ఎన్నికయ్యారు. 1969 - 71 మధ్య కాలంలో అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు 1971లో తిరిగి లోకసభకు ఎన్నికయ్యారు. 1973 - 1977 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు 1977లో తిరిగి ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. 1978-1982 మధ్య కాలంలో ఆయన రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1982-84 మధ్య కాలంలో పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు 1989లో మరోసారి లోకసభకు ఎన్నికయ్యారు. 1991లో తిరిగి లోకసభకు ఎన్నకయ్యారు. 1991-96 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. 1996లో మరోసారి ఆయన లోకసభకు ఎన్నికయ్యారు. 2002 - 2004 మద్య కాలంలో ఎఐసిసి ఎస్సీ, ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో మరోసారి లోకసభకు ఎన్నికయ్యారు.

వెంకటస్వామి మృతికి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సంతాపం ప్రకటించారు. వెంకటస్వామిని గొప్ప పార్లమెంటేరియన్‌గా గవర్నర్ అభివర్ణించారు. తెలంగాణ కోసం ఆరాపడిన వ్యక్తి వెంకటస్వామి అని కెసిఆర్ అన్నారు. వెంకటస్వామి అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించనుంది. ఆయన అంత్యక్రియలు మంగళవారం జరుగుతాయి. ఆయన భౌతిక కాయాన్ని ఆస్పత్రి నుంచి నివాసానికి తరలించారు. వెంకటస్వామి మృతికి కాంగ్రెసు నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెసు నాయకులు, ఇతర పార్టీల నాయకులు కూడా ఆయన మృతికి సంతాపం ప్రకటించారు.

English summary
senior Congress leader and ex MP from Telangana G Venkataswami, known as Kaka has been passed away in Hyderabad at Care hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X