వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలప్రియకు 'శిల్పా' షాక్: కుటుంబసభ్యులతో రాజీనామాపై , 'ఆట మొదలైంది'

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: తన రాజీనామా ఆమోదం పొందడం పట్ల మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ నేత శిల్పా చక్రపాణిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 3వ, తేదిన తాను ప్రకటించినట్టుగానే ఇక ఆట మొదలైందన్నారు. టిడిపి ఎన్ని కుట్రలు చేసినా నంద్యాలలో తాము విజయం సాధిస్తామని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

టిడిపిని వీడి వైసీపీలో చేరిన తర్వాత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ చీఫ్ జగన్ శిల్పా చక్రపాణిరెడ్డికి సూచించారు. రాజీనామా చేయకుండా వైసీపీలో చేరితే టిడిపిై తాము చేసే విమర్శలకు తేడా ఉండదని జగన్ శిల్పాకు చెప్పారు.

రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?రంగంలోకి ఆదిశేషగిరిరావు: 'శిల్పా'కు మహేష్‌బాబు అభిమానుల మద్దతు, 'పవన్' మద్దతెవరికీ?

దీంతో ఈ నెల 3వ, తేదిన నంద్యాల బహిరంగసభలోనే శిల్పా చక్రపాణిరెడ్డి తన రాజీనామా లేఖను జగన్‌కు అందించారు. ఈ రాజీనామా లేఖను ఆయన శాసనమండలి కార్యాలయానికి పంపారు.

'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే' 'మా కుటుంబంతో సన్నిహిత సంబంధాలు, పవన్‌కళ్యాణ్ మద్దతు మాకే'

రాజీనామా అస్త్రంతో రాజకీయంగా టిడిపిని ఇరుకున పెట్టేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు వైసీపీ నేతలు టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాకు మరింత పట్టుబట్టే అవకాశాలు లేకపోలేదు.ఇదిలా ఉంటే రాజీనామా ఆమోదించిన విషయమై శిల్పా చక్రపాణిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

రాజీనామాపై కుటుంబసభ్యులతో చర్చ

రాజీనామాపై కుటుంబసభ్యులతో చర్చ

టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని నిర్ణయించుకొన్న తర్వాత లోటస్‌పాండ్‌లో వైసీపీ చీఫ్ జగన్‌ను శిల్పా చక్రపాణిరెడ్డి కలిశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ సూచించారు. గంటల తరబడి చర్చించారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని వైసీపీ చీఫ్ జగన్ కోరడంతో కుటుంబసభ్యులతో శిల్పా చక్రపాణిరెడ్డి చర్చించారు. ఎట్టకేలకు కుటుంబసభ్యులు కూడ రాజీనామా చేయాలని సూచించారు. రాజీనామా చేయాలని సూచించడంతో ఈ నెల 3వ, తేదిన జరిగిన బహిరంగసభలో చక్రపాణిరెడ్డి రాజీనామా లేఖను ఇచ్చారు.

Recommended Video

Mahesh fans Support To YSRCP in Nandyal By polls, What About Pawan Kalyan | Oneindia Telugu
రెడ్డి సుబ్రమణ్యం ఫోన్

రెడ్డి సుబ్రమణ్యం ఫోన్

శాసనమండలి కార్యాలయానికి శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా చేరిన రెండు రోజుల తర్వాత శాసనమండలి డిప్యూటీ ఛైర్మెన్ రెడ్డి సుబ్రమణ్యం శిల్పా చక్రపాణిరెడ్డికి ఫోన్ చేశారు. రాజీనామా లేఖ అందిన విషయాన్ని చెప్పారు. రాజీనామా విషయంలో మరోసారి ఆలోచన ఉందా అని ఆయనను ప్రశ్నించారు.అయితే రాజీనామా విషయంలో పునరాలోచన లేదని ఆయన తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.దీంతో రాజీనామాను ఆమోదిస్తున్నట్టుగా శిల్పా చక్రపాణిరెడ్డికి సమాచారాన్ని శాసనమండలి కార్యాలయం అందించింది.

ఆట మొదలైందన్న శిల్పా చక్రపాణిరెడ్డి

ఆట మొదలైందన్న శిల్పా చక్రపాణిరెడ్డి

ఇక నంద్యాలలో ఆట మొదలైందన్నారు వైసీపీ నేత శిల్పాచక్రపాణిరెడ్డి. నంద్యాలలో వైసీపీని ఓడించేందుకు టిడిపి అనేక కుట్రలను కుతంత్రాలను పన్నుతోందని ఆయన ఆరోపించారు. కానీ, వాటన్నింటిని చేధించి తన సోదరుడు మోహన్‌రెడ్డి నంద్యాలలో విజయం సాధించనున్నట్టు ధీమాను వ్యక్తం చేశారు. ఆట మొదలైందని ఆయన చెప్పారు.ఈ ఆటలో విజయం తమదే అంటూ ఆయన ధీమాను వ్యక్తం చేశారు.

అఖిలప్రియ రాజీనామా చేసి ఓట్లు అడగాలి

అఖిలప్రియ రాజీనామా చేసి ఓట్లు అడగాలి

పార్టీ మారిన తాను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్టుగానే వైసీపీ నుండి టిడిపిలో చేరిన మంత్రి అఖిలప్రియ కూడ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు. తన మాదిరిగానే పార్టీ మారిన ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేసి మంచి సంప్రదాయాన్ని నెలకొల్పాలని ఆయన కోరారు. అఖిలప్రియ రాజీనామా చేసి నంద్యాలలో ఓట్లు అడగాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Ysrcp leader Shilpa Chakrapani reddy welcomed his resignation approval. He demanded to Akhila Priya resign to Mla post.No moral values Tdp leaders
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X