కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: గంగుల బాటలోనే వైసీపీలోకి శిల్పా మోహన్ రెడ్డి, ఏప్రిల్ 21 లేదా 22 ముహుర్తం ఖరారు

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాల టిడిపి ఇంచార్జ్ శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడనున్నారు. ఈ నెల 21 లేదా 22 వ, తేదిల్లో శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడి వైసీపిలో చేరే అవకాశం ఉంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి టిక్కెట్టు దక్కకపోవడంతో ఆయన వైసీపీలో చేరే అవకాశం ఉంది.

కర్నూల్ జిల్లా టిడిపిలో సంక్షోభం కొనసాగుతోంది. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గత నెలలో మరణించాడు. గుండెపోటుతో ఆయన మరణించాడు.

భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.అయితే 2014 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపి తరపున ఈ స్థానం నుండి భూమా నాగిరెడ్డి పోటీచేశారు. టిడిపి నుండి శిల్పా మోహన్ రెడ్డి పోటీచేశారు.అయితే భూమా నాగిరెడ్డి విజయం సాధించారు.

అయితే గత ఏడాదిలో తన కూతరితో కలిసి వైసీపిని వీడి భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరారు.అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడాన్ని శిల్పా సోదరులు తీవ్రంగా వ్యతిరేకించారు.అయితే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో శిల్పా చక్రపాణి రెడ్డి విజయం సాధించారు.అయితే చక్రపాణి రెడ్డి విజయంలో భూమా కీలకంగా వ్యవహరించారు.

నంద్యాల టిక్కెట్టు దక్కదని తెలిసి వైసీపిలోకి శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల టిక్కెట్టు దక్కదని తెలిసి వైసీపిలోకి శిల్పా మోహన్ రెడ్డి

భూమా నాగిరెడ్డి మరణంతో నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.అయితే ఈ స్థానం నుండి పోటీచేసేందుకు తనకు అవకాశం కల్పించాలని శిల్పా మోహన్ రెడ్డి టిడిపి నాయకత్వాన్నికోరుతున్నారు.అయితే భూమా కుటుంబ సభ్యులకే టిక్కెట్టు ఇవ్వనున్నట్టు పార్టీ నాయకత్వం సంకేతాలు ఇచ్చింది.దీంతో ఆయన స్వతంత్రంగా పోటీచేయాలని ఆలోచించారు.మరో వైపు అదే సమయంలో తన అనుచరులతో కూడ ఆయన సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. అయితే వైసీపిలో చేరేందుకుగాను శిల్పా మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు ఈ నెల 21 లేదా 22 న ఆయన వైసీపి తీర్థం పుచ్చుకొనే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు.

టిక్కెట్టు కోసమే వైసీపిలోకి శిల్పామోహన్ రెడ్డి

టిక్కెట్టు కోసమే వైసీపిలోకి శిల్పామోహన్ రెడ్డి

నంద్యాల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్టు దక్కదనే విషయం స్పష్టత రావడంతో పార్టీ మారాలని శిల్పా మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.అయితే వైసీపిలో చేరాలని మోహన్ రెడ్డి తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన సోదరుడు చక్రపాణిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ విషయమై సోదరులు గొడవ పెట్టుకొన్నారని శిల్పా సన్నిహితులు చెబుతున్నారు.

అనుచరులతో చర్చించిన తర్వాతే శిల్పా మోహన్ రెడ్డి నిర్ణయం

అనుచరులతో చర్చించిన తర్వాతే శిల్పా మోహన్ రెడ్డి నిర్ణయం

నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిక్కెట్టు తనకు దక్కదనే అభిప్రాయానికి శిల్పా మోహన్ రెడ్డి వచ్చారనే ఆయన సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ఆయన పార్టీ మారాలనే అభిప్రాయానికి వచ్చారని చెబుతున్నారు.భూమా కుటుంబానికే టిక్కెట్టు దక్కనుంది.అయితే ఈ కుటుంబం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.ఈ పరిణామాలన్నింటిపై శిల్పా మోహన్ రెడ్డి తన అనుచరులతో ఎప్పటికప్పుడు చర్చించారు.ఈ పరిణామాలపై అనుచరులతో చర్చించిన మీదట ఆయన పార్టీ మారాలనే నిర్ణయం తీసుకొన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

ఎన్నికల ముందే టిడిపిలో చేరిన శిల్పా మోహన్ రెడ్డి

ఎన్నికల ముందే టిడిపిలో చేరిన శిల్పా మోహన్ రెడ్డి

2014 అసెంబ్లీ ఎన్నికల ముందే శిల్పా మోహన్ రెడ్డి టిడిపిలో చేరారు. ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ విషయమై ఆయన పార్టీ నాయకత్వంతో విభేదించి టిడిపిని కూడ వీడేందుకు సిద్దమయ్యారు. వైసీపిలో ఆయన చేరికకు ఆ పార్టీ అధినేత జగన్ కూడ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం కూడ సాగుతోంది.

టిడిపికి కర్నూల్ లో వరుస షాక్ లు నాడు గంగుల, నేడు శిల్పా

టిడిపికి కర్నూల్ లో వరుస షాక్ లు నాడు గంగుల, నేడు శిల్పా

2014 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున టిడిపిలో చేరారు నాయకులు.ఈ జిల్లా నుండి గంగుల ప్రభాకర్ రెడ్డి, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ లాంటి నాయకులు కాంగ్రెస్ ను వీడి టిడిపిలో చేరారు. అయితే భూమా నాగిరెడ్డి టిడిపిలో చేరడంతో గంగుల ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ఆయన టిడిపిని వీడి వైసీపిలో చేరారు. ఆయన వైసీపిలో చేరిన వెంటనే ఎమ్మెల్సీ పదవిని గంగుల ప్రభాకర్ రెడ్డికి వైసీపి కట్టబెట్టింది.అయితే నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తామని వైసీపి హమీ ఇవ్వడంతో శిల్పా పార్టీ మారేందుకు రంగం సిద్దం చేసుకొన్నారని అనుచరులు చెబుతున్నారు.

English summary
Tdp Nandhyal incharge silpa Mohanreddy will join in Ysrcp on 21 or 22 April.Tdp already clarified Bhuma Nagi Reddy family members will contest in Nandyal by election.so, silpa decided to join in Ysrcp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X