వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అఖిలప్రియకు శిల్పావర్గం షాక్: నంద్యాలపై ఆళ్ళగడ్డ పెత్తనమా?

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరిగే సమయంలోనే టిడిపిలోని ప్రఛ్చన్నయుద్దం మరోసారి తెరమీదికి వచ్చింది. నంద్యాల మున్సిఫల్ చైర్ పర్సన్ సులోచన మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి తరపున రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై సమరానికి సై అంటున్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే అఖిలప్రియ తనను అవమానపర్చేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎక్కువ కాలం ఈ అవమానాలను భరించలేనని ఆమె తెగేసి చెబుతున్నారు.

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఈ ఏడాది మార్చిమాసంలో భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు.అయితే భూమా నాగిరెడ్డి మరణంతో ఈ స్థానం ఖాళీ అయింది. ఆరు మాసాలలోపు ఎన్నికలను నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

అయితే ఈ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి కూడ రంగం సిద్దం చేసుకొంటున్నారు.అయితే భూమా కుటుంబసభ్యులకే టిక్కెట్టు ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్టు పార్టీవర్గాలు చెబుతున్నాయి.గత సంప్రదాయాలు కూడ ఇలానే ఉన్నాయని పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు.

అయితే ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపాలనే విషయమై త్వరలోనే ప్రకటించనున్నారు చంద్రబాబునాయుడు.అయితే ఈ స్థానం నుండి ఎవరిని బరిలోకి దింపితే పార్టీ విజయం సాధిస్తోందనే విషయమై సర్వే నిర్వహిస్తోంది.ఈ సర్వే ఆధారంగా పార్టీ అభ్యర్థులను నిర్ణయించనుంది.

అయితే ఈ సమయంలో నంద్యాల మున్సిఫల్ ఛైర్ పర్సన్ సులోచన రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియపై విమర్శులు చేయడం సంచలనంగా మారింది. ఎంతకాలం ఈ అవమానాలను భరించలేమని ఆమె తెగేసి చెప్పారు.ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు జోక్యం చేసుకోవాలని ఆమె కోరారు.

మంత్రి అఖిలప్రియ అవమానపరుస్తున్నారు.

మంత్రి అఖిలప్రియ అవమానపరుస్తున్నారు.

రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి భూమా అఖిలప్రియ తనను అవమానపరుస్తున్నారని నంద్యాల మున్సిఫల్ చైర్ పర్సన్, టిడిపి నాయకురాలు సులోచన ఆరోపించారు. నంద్యాల మున్సిఫాల్టిలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో తమను పాల్గొనకుండా చేస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. నంద్యాల మున్సిపాలిటీనే అఖిలప్రియ ఎక్కువగా కార్యక్రమాలను చేపడుతున్నారు. ఆళ్ళగడ్డకు చెందిన వారు నంద్యాలకు వచ్చి తమను అవమానపరుస్తున్నారని ఆమె ఆరోపించారు.

భూమా నాగిరెడ్డి వాగ్ధానాల అమలుకు

భూమా నాగిరెడ్డి వాగ్ధానాల అమలుకు

గత ఎన్నికలకు ముందు తనను ఎమ్మెల్యే గెలిపిస్తే నంద్యాలను అభివృద్ది పర్చనున్నట్టు భూమానాగిరెడ్డి ప్రజలకు వాగ్దానం చేశారు. 13 ఇళ్ళు,. రోడ్ల విస్తరణ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నట్టు భూమా నాగిరెడ్డి వాగ్ధానం చేశారు.అయితే ఆయన గుండెపోటుతో మరణించారు.అయితే ఈ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికే భూమానాగిరెడ్డి గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం అఖిలప్రియ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఆమె అనేక కార్యక్రమాలను వేగంగా చేపడుతున్నారు.నంద్యాల మున్సిపాలిటీలోనే అభివృద్ది కార్యక్రమాలకోసం కేటాయించారు.

అవమానాలను ఎక్కువకాలం భరించలేం

అవమానాలను ఎక్కువకాలం భరించలేం

ఎక్కువ కాలం పాటు మంత్రి అఖిలప్రియ అవమానాలను భరించేందుకు తాము సిద్దంగా లేమని మున్సిఫల్ చైర్మెన్ సులోచన చెబుతున్నారు.అంతేకాదు ఆళ్ళగడ్డకు చెందిన వారి పెత్తనం నంద్యాలపై ఎందుకని ఆమె ప్రశ్నించారు.అంతేకాదు నంద్యాల పట్టణంలో జరిగే అభివృద్ది కార్యక్రమాల్లో అఖిలప్రియతో పాటు సులోచన పాల్గొనడం లేదు. తమను అవమానపర్చుతున్నందునే తాము ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సులోచన చెబుతున్నారు.

శిల్పా తరపున పోరాటం

శిల్పా తరపున పోరాటం

నంద్యాల అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఉప ఎన్నికలను పురస్కరించుకొని అఖిలప్రియను రాజకీయంగా ఇరుకునపెట్టేందుకు శిల్పావర్గం ప్రయత్నాలను ప్రారంభించింది.అయితే నంద్యాలలో చేపడుతున్న అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుపెట్టుకొని శిల్పా వర్గం ఆమెను దెబ్బతీసే ప్రయత్నంచేస్తోందని అఖిలవర్గం ఆరోపిస్తోంది.అయితే ప్రోటోకాల్ ను పాటించడం లేదని, ఉద్దేశ్యపూర్వకంగానే తమను అవమానపర్చేందుకు మంత్రి అఖిలప్రియ ప్రయత్నిస్తున్నారని శిల్పావర్గం ఆరోపిస్తోంది.ఈ విషయమై శిల్పావర్గం తరపున మున్సిఫల్ చైర్ పర్సన్ సులోచన ముందుండి పోరాటాన్ని సాగిస్తున్నారు.

English summary
Shock to minister akhila priya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X