వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వెంకయ్య, సుజనా సంస్థలకు హోంశాఖ హెచ్చరిక: మరో 5,922 సంస్థలకి కూడా

స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓలు)గా రిజిస్టరై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, విదేశాల నుంచి నిధులు పొందాయన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ దేశంలోని 5,922సంస్థలకు నోటీసులు జారీ చేసి

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: స్వచ్ఛంద సంస్థలు(ఎన్జీఓలు)గా రిజిస్టరై విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్ఏ) కింద రిజిస్టరు కాకుండా, విదేశాల నుంచి నిధులు పొందాయన్న ఆరోపణలపై కేంద్ర హోంశాఖ దేశంలోని 5,922సంస్థలకు నోటీసులు జారీ చేసింది. వీటిలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న స్వర్ణ భారత్ ట్రస్ట్, సుజనా చౌదరి నిర్వహిస్తున్న సుజనా చారిటబుల్ ట్రస్టులున్నాయి.

అంతేగాక, శ్రీసత్యసాయి మెడికల్ ట్రస్ట్ వంటి ప్రముఖ సంస్థలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరమూ ఆదాయ రిటర్నులు సమర్పించాల్సిన ఈ సంస్థలు 2010 నుంచి 2015 మధ్య రిటర్నులు దాఖలు చేయలేదని తెలుస్తోంది.

 Show cause notices to 5,922 NGOs over foreign donations, may lose licence

ఇక నోటీసులు అందుకున్న మిగితా ప్రముఖ సంస్థల్లో ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం, శ్రీరామకృష్ణ సేవాశ్రమం, ఇందిరాగాంధీ కళాక్షేత్రం, నెహ్రూ స్మారక మ్యూజియం-గ్రంథాలయం, ఇగ్నో వంటి సంస్థలు కూడా ఉండటం గమనార్హం. జులై 23లోగా నోటీసులకు సమాధానం ఇవ్వకుంటే.. రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ హెచ్చరించింది. కాగా, ఈ నోటీసులను జులై 8నే ఈ సంస్థలకు పంపింది.

English summary
The Union home ministry has issued a warning to 5,922 non-governmental organizations (NGOs), threatening to cancel their FCRA (Foreign Contribution Regulation Act) licences that would stop them from receiving foreign funding, if they fail to file annual income and expenditure records for five consecutive years, a senior home ministry official confirmed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X