వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు జగన్ షాక్: నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా, టిడిపిని వీడిన నేతలకు జగన్ బంపరాఫర్లు

నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారనున్నాయి. ఈ స్థానానికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యంగా మారనున్నాయి. ఈ స్థానానికి ఇంకా ఎన్నికల షెడ్యూల్ విడుదల కాలేదు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కన్పిస్తోంది.అయితే టిడిపి తరపున భూమా బ్రహ్మనందరెడ్డిని బరిలోకి దింపుతోంది ఆ పార్ట. అయితే టిడిపిని వీడి ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రె్డ్డిని ఈ స్థానం నుండి బరిలోకిదింపనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ఆదివారం నాడు ప్రకటించారు.

అయితే ఆరుమాసాల వ్యవధిలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.అయితే ఈ ఏడాది సెప్టెంబర్ 12వ,తేది నాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ పూర్తైన తర్వాత ఈ ఎన్నికలకు కూడ షెడ్యూల్ వెలువడే అవకాశాలున్నట్టుగా రాజకీయపార్టీలు అంచనావేస్తున్నాయి.

అయితే ఈ స్థానానికి ఎన్నికలు జరగకుండా ఉండేందుకుగాను టిడిపి నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది.అయితే ఈ ప్రయత్నాలకు వైసీపీ చెక్ పెట్టింది. రాజకీయంగా టిడిపిని దెబ్బకొట్టేందుకు వైసీపీ కూడ వ్యూహత్మకంగానే అడుగులు వేస్తోంది.

అయితే టిడిపి అడుగులకు ధీటుగానే వైసీపీ అడుగులు వేస్తోంది . ఈ ఎన్నిక ఏకగ్రీవం కాకుండా వైసీపీ తన అభ్యర్థిని బరిలోకి దింపనున్నట్టు ప్రకటించింది.దీంతో టిడిపి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.

నంద్యాల బరిలో శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల బరిలో శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల అసెంబ్లీకి జరిగే ఉప ఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలోకి దిగనున్నారు.ఈ ఏడాది మార్చి 12వ, తేదిన భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణంతో ఈ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని బరిలోకి దింపుతున్నట్టుగా ఆ పార్టీ ఆదివారం నాడు ప్రకటించింది. కర్నూల్ జిల్లా నేతలతో వైసీపీ చీఫ్ జగన్ చర్చించారు. ఈ మేరకు నంద్యాల నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా శిల్పా ను బరిలోకి దింపాలని నిర్ణయించారు. అంతేకాదు నంద్యాల నియోజకవర్గానికి శిల్పా మోహన్ రెడ్డిని సమన్వయకర్తగా కూడ నియమిస్తూ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆ పార్టీ ప్రకటించింది.

సాంప్రదాయాలను పాటించాలని టిడిపి వినతి

సాంప్రదాయాలను పాటించాలని టిడిపి వినతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాటించిన సాంప్రదాయాలను, ఏపీలో ఇటీవల చోటుచేసుకొన్న సాంప్రదాయాలను కొనసాగించాలని టిడిపి వైసీపీని కోరింది. ఎమ్మెల్యేగా లేదా ఎంపీగా ఉంటూ మరణిస్తే అదే కుటుంబానికి చెందినవారు పోటీచేస్తే పోటీ పెట్టకుండా ఉన్న విషయాన్ని టిడిపి గుర్తుచేస్తోంది. 2014 ఎన్నికల సమయంలో ఆళ్ళగడ్డ నుండి పోటీచేసిన శోభా నాగిరెడ్డి మరణంతో ఆ స్థానంలో టిడిపి పోటీకి నిలపలేదు.గతంలో చోటుచేసుకొన్న సందర్భాలను ఆ పార్టీ గుర్గుచేస్తోంది.అయితే వైసీపీ మాత్రం నంద్యాల స్థానానికి తమ అభ్యర్థిని ప్రకటించడంతో పోటీ అనివార్యంగా మారింది.

వైసీపీ పోటీ వెనుక ఉద్దేశ్యమిదే

వైసీపీ పోటీ వెనుక ఉద్దేశ్యమిదే

2014 ఎన్నికల్లో నంద్యాల అసెంబ్లీ స్థానం నుండి వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన భూమా నాగిరెడ్డి ఏడాదిన్నర క్రితం వైసీపీని వీడి టిడిపిలో చేరారు. అయితే భూమాతో పాటు ఆయన కూతురు భూమా అఖిలప్రియ ప్రస్తుతం మంత్రివర్గంలోకి తీసుకొన్నారు చంద్రబాబునాయుడు.అయితే 2014 ఎన్నికల్లో ఈ సీటును తాము కైవసం చేసుకొన్నందున ఉప ఎన్నికల్లో కూడ తమ పార్టీకి చెందిన అభ్యర్థిని ఏకగ్రీవం చేయాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. సాంకేతికంగా భూమా నాగిరెడ్డి తమ పార్టీకి చెందిన అభ్యర్థి అని వైసీపీ గుర్తుచేస్తోంది. అయితే టిడిపిని దెబ్బకొట్టేందుకు వైసీపీ శిల్పాను రంగంలోకి దింపింది.

టిడిపిని వీడిన నేతలకు వైసీపీ బంపర్ ఆఫర్లు

టిడిపిని వీడిన నేతలకు వైసీపీ బంపర్ ఆఫర్లు

టిడిపిని వీడిన నేతలకు వైసీపీ చీఫ్ జగన్ పెద్దపీట వేస్తున్నారు. అధికారపార్టీని వీడి వైసీపీలో చేరిన గంగుల ప్రభాకర్ రెడ్డికి పార్టీలో చేరిన వారం రోజులకే ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఆయన ఎమ్మెల్సీగా విజయం సాధించాడు. మరోవైపు టిడిపిని వీడిన మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పదిరోజులకే ఎమ్మెల్యే టిక్కెట్టును పొందాడు. నంద్యాల టిక్కెట్టు విషయమై చంద్రబాబునాయుడు తేల్చకపోవడంతో ఆయన టిడిపిని వీడారు.ఈ నెల 14వ, తేదిని ఆయన వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన పదిరోజుల తర్వాత నంద్యాల అసెంబ్లీ టిక్కెట్టును శిల్పా పేరును ఖరారుచేస్తూ వైసీపీ నిర్ణయం తీసుకొంది.

English summary
Ysrcp declared silpa Mohan Reddy contest in Nandyala by elections .. Ysrcp chief Ys jagan meeting with kurnool district party leaders at Hyderabad on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X