వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉచితంగా లాక్కొని, అమ్మేసుకున్నారు: శిల్పా మోహన్ రెడ్డి మెడకు వివాదం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మెడకు వివాదం చుట్టుకుంది. శిల్పా దళితుల భూములు ఆక్రమించారంటూ పెద్ద ఎత్తున దళితులు ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మెడకు వివాదం చుట్టుకుంది. శిల్పా దళితుల భూములు ఆక్రమించారంటూ పెద్ద ఎత్తున దళితులు ఆర్టీవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.

నంద్యాలకు ఉపఎన్నిక: జగన్‌కు గట్టి షాక్, టిడిపిలో చేరిన గంగుల, అందుకేనా?నంద్యాలకు ఉపఎన్నిక: జగన్‌కు గట్టి షాక్, టిడిపిలో చేరిన గంగుల, అందుకేనా?

మా భూములు మాకివ్వాలి

మా భూములు మాకివ్వాలి

శిల్పా మోహన్ రెడ్డి దళితుల భూములు ఆక్రమించారని వారు ఆరోపణలు చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చాబోలు గ్రామంలో రెండున్నర ఎకరాల భూమిని శిల్పా మోహన్ రెడ్డి ఆక్రమించారని, ఆ భూములు తిరిగి తమకు అప్పగించాలని కోరారు.

తన కొడుకులను మోసం చేసి మరీ

తన కొడుకులను మోసం చేసి మరీ

ఈ సందర్భంగా బాధితులు తమతో మాట్లాడినట్లు ఓ టీవీ ఛానల్ పేర్కొంది. తన భూమి తనకు తిరిగి ఇవ్వాలని, తన కొడుకులను మోసం చేసి శిల్పా భూములను రాయించుకున్నారని, అది చెల్లదని, తన పేరుమీద భూమి ఉందని బాధితులు చెప్పారని పేర్కొన్నారు.

ఆ విషయం తెలియదు

ఆ విషయం తెలియదు

చెరువు కుంటకని తన కొడుకుల ద్వారా బలవంతంగా భూమి తీసుకున్నారని, ఆ విషయం తనకు తెలియదని, ఆ పత్రాలపై తన సంతకం కూడా లేదని బాధితులు తెలిపారు. తన భూమి కావాలని, అందరూ కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు.

చెరువు కోసం తీసుకొని..

చెరువు కోసం తీసుకొని..

దీనిపై ఎస్సీ కార్పోరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు మాట్లాడారు. శిల్పా మోహన్ రెడ్డి చాబోలు గ్రామానికి చెరువు కుంటకోసం దళితుల భూమిని తీసుకున్నారని, మార్తమ్మ అనే మహిళకు చెందిన భూమిని చెరువుకుంట పేరుతో తీసుకున్నారని, వెంటనే నేషనల్ హైవే రావడం, దానికి ఆ భూమిని శిల్ప అమ్మడం జరిగిందన్నారు.

శిల్పా మోహన్ రెడ్డి ఏం చెబుతారు?

శిల్పా మోహన్ రెడ్డి ఏం చెబుతారు?

మార్తమ్మకు రూపాయి ఇవ్వలేదని జూపూడి ఆరోపించారు. బాధితులు పదిహేనేళ్లుగా పోరాటం చేస్తున్నారని, ఇంతవరకు పరిష్కారం కాలేదన్నారు. ఇతరులకు చెందిన ఏడున్నర ఎకరాల భూమిని కూడా శిల్పా తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై శిల్పా మోహన్ రెడ్డి ఏం మాట్లాడాతారో చూడాలంటున్నారు.

English summary
YSR Congress Party MLA candidate Silpa Mohan Reddy facing bitter experience from Dalith.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X