వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ బాధ్యత జగన్‌దే, మాట్లాడతా: అఖిల, బాబుకు వైసిపి ఊహించని షాక్

నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై ఉందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు.

|
Google Oneindia TeluguNews

కర్నూలు: నంద్యాల ఉప ఎన్నికలను ఏకగ్రీవం చేయాల్సిన బాధ్యత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత వైయస్ జగన్‌పై ఉందని మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. పార్టీలకతీతంగా భూమా నాగిరెడ్డి సేవల్ని వ్యక్తిగతంగా గుర్తుపెట్టుకుని ఏకగ్రీవం చేయాలన్నారు.

<strong>నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి</strong>నంద్యాలలో వైసీపీ అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డి

నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. ఆదివారం విడుదల ఈ మేరకు వైసిపి ప్రకటన చేసింది.

జగన్ హామీతో..

జగన్ హామీతో..

నంద్యాల నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా శిల్పా మోహన్ రెడ్డిని నియమిస్తున్నామని, ఉప ఎన్నికల్లోనూ ఆయనే అభ్యర్థి అని తెలిపింది. శిల్పా ఇటీవలే టిడిపి నుంచి వైసిపిలోకి వెళ్లారు. ఆయన టిక్కెట్ హామీ అంశం పైనే వైసిపిలో చేరారు. ఈ మేరకు జగన్ హామీ ఇవ్వడంతో ఆయన జంప్ అయ్యారు.

చంద్రబాబు ఏం చెబితే అదే..

చంద్రబాబు ఏం చెబితే అదే..

ఆయనను అభ్యర్థిగా ప్రకటించడంతో అఖిలప్రియ స్పందించారు.
ఏకగ్రీవానికి పార్టీ తరఫున తాను త్వరలోనే మాట్లాడతారన్నారు. జగన్‌, వైయస్ విజయమ్మలను భూమా కుటుంబ సభ్యులు కలిసి ఏకగ్రీవానికి సహకరించాలని విన్నవించుకోవడం గురించి విలేకరులు అడిగారు. దానికి అఖిలప్రియ స్పందిస్తూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం మేరకు ఎలా చెబితే అలా నడుచుకుంటానని తెలిపారు.

ఉప ఎన్నికకు తెర తీసిన వైసిపి

ఉప ఎన్నికకు తెర తీసిన వైసిపి

నంద్యాల నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని నియమిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఉప ఎన్నికల్లో ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నంద్యాల ఉప ఎన్నికకు తెర తీసినట్లైంది.

ఎన్నికలకు వెళ్లేలా ముందస్తు హామీతోనే..

ఎన్నికలకు వెళ్లేలా ముందస్తు హామీతోనే..

ఎన్నికలకు వెళ్లేలా ముందస్తు హామీతోనే శిల్పా మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారని అంటున్నారు. జగన్ కూడా పోటీకే సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల వ్యూహంలో భాగంగా శనివారం మధ్నాహ్నం హైదరాబాద్‌ నుంచి నంద్యాలకు వచ్చిన శిల్పా పట్టణంలోని ప్రముఖుల ఇళ్లకు నేరుగా వెళ్లి వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

సీటు పంచాయతీతోనే..

సీటు పంచాయతీతోనే..

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో జిల్లాలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో ఒకే గూటిలో ఉంటున్న భూమా, శిల్పా వర్గం మధ్య నంద్యాల సీటుపై సీఎం పంచాయితీ చేసిన విషయం విదితమే. ఉప ఎన్నికల్లో తనకే టికెట్టు ఇవ్వాలంటూ 2014 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన శిల్పా మోహన్ రెడ్డి పట్టుబట్టారు. మృతి చెందిన కుటుంబంలో వారికే సీటు కేటాయించడం సంప్రదాయమని పార్టీ చంద్రబాబు తేల్చడంతో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి టిడిపిని వీడారు. ఈనెల 14వ తేదీన తన మద్దుతుదారులతో ఆయన వైసిపిలో చేరారు.

మాట్లాడేందుకు సిద్ధమవగా.. బాబుకు ఊహించని షాకిచ్చిన జగన్

మాట్లాడేందుకు సిద్ధమవగా.. బాబుకు ఊహించని షాకిచ్చిన జగన్

ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయినా మృతిచెందితే ఆ కుటుంబానికే అవకాశం ఇచ్చి ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తోంది. 2014లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగి రెడ్డి రహదారి ప్రమాదంలో మృతి చెందినప్పుడు వైసిపి అదే కుటుంబానికి చెందిన శోభానాగిరెడ్డి కుమార్తె అఖిలప్రియకు టికెట్‌ ఇచ్చింది. అప్పుడు టిడిపి తన అభ్యర్థిని నిలబెట్టకుండా ఏకగ్రీవానికి సహకరించింది. అదే తరహాలో ఇప్పుడు భూమా నాగిరెడ్డి మృతితో అదే కుటుంబానికి టిడిపి టిక్కెట్‌ ఇస్తుందని, వైసిపి పోటీ పెట్టకూడదని, మిగిలిన పార్టీలు సహకరించాలని టిడిపి కోరింది. ఈ విషయమై వైసిపి నేతలతో చర్చించడానికి చంద్రబాబు పర్యటన అనంతరం పార్టీ నేతలు ప్రణాళిక చేసుకున్నారు. అయితే ఈలోగా వైసిపి తన అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి అంటూ ప్రకటించింది.

English summary
Dashing the hopes of the Telugu Desam Party of getting its candidate Bhuma Brahmananda Reddy elected unanimously in the bypoll to the Nandyal Assembly constituency, the YSR Congress leadership announced the former Minister Silpa Mohan Reddy as its nominee on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X