వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కే షణ్ముగం, ఏపీ మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం మంత్రి షణ్ముగం మాట్లాడారు. ఏపీ రాజధాని పైన సీఎం చంద్రబాబు పూర్తి స్పష్టతతో ఉన్నారని చెప్పారు. జూన్‌లోపు రాజధాని మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామన్నారు.

మంత్రి నారాయణ మాట్లాడుతూ.. మే 15 తర్వాత రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామన్నారు. రైతుల భాగస్వామ్యంతోనే రాజధాని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకోరని చెప్పారు. రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూమి సేకరిస్తామన్నారు. మరోవైపు, రాజధానిపై ఏపీ స్పీడ్ పెంచింది.

కాగా, గురువారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ ప్రతినిధి గోపినాథ్ పిళ్లై, సింగపూర్ మంత్రి షణ్ముగం తదితరులు భేటీ అయి రాజధానిపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఆకట్టుకునే రాజధానిని నిర్మిస్తామని చెప్పారు. త్వరలో రాజధాని పేరు ప్రకటిస్తామన్నారు. జూన్ కల్లా తొలిదశ ప్రణాళిక ఇస్తామని, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షిస్తామని మంత్రి షణ్ముగం తెలిపారు. సింగపూర్ ఏపీని అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయనుంది.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధాని నిర్మాణం కోసం అవసరమైన భూ సమీకరణ పూర్తికాగానే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని జూన్‌ నాటికి తొలిదశ నిర్మాణానికి అవసరమైన ప్లాన్‌ను సిద్ధం చేస్తామని షణ్ముగం తెలిపారు సచివాలయంలో గురువారం చంద్రబాబుతో కలసి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తమకు ఎంతో కాలంగా పరిచయమని, ఆయన విజన్‌ ఉన్న సీఎం అన్నారు. తమ మధ్య స్నేహ సంబంధాలు చాలా కాలంగా కొనసాగుతున్నాయన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

నూతన రాజధాని నిర్మాణంతో అవి మరింత బలోపేతం అవుతాయన్నారు. విభజన తర్వాత ఏపీకి నూతన రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ సహకారం కావాలన్న చంద్రబాబు విజ్ఞప్తితో తాము అడుగు వేశామన్నారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన పనులు పర్యవేక్షించేందుకుగానూ సింగపూర్‌ విదేశాంగ రాయబారిగా ఉన్న గోపీనాథ్ పిళ్లైని ఏపీ-సింగపూర్‌ల మధ్య ప్రత్యేక రాయబారిగా నియమిస్తున్నామని తెలిపారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

సింగపూర్‌‌లోని పలు కంపెనీలను ఏపీకి తీసుకురావడానికి పిళ్లై కృషి చేస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీల ప్రధాన కార్యాలయాలన్నీ సింగపూర్‌లోనే ఉన్నాయన్నారు. సింగపూర్‌ ప్రభుత్వం తరఫున ప్రైవేటు సంస్థ రాజధాని నిర్మాణాన్ని చేపడుతుందన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

వ్యాపార, వాణిజ్యంతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ అన్ని విధాలా అనువైనదనే విషయం సింగపూర్‌ ప్రభుత్వానికి తెలుసని చంద్రబాబు అన్నారు. ఈ-బిజ్‌ ద్వారా వాణిజ్య, వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం కల్పించామని, పరిశ్రమల ఏర్పాటుకు సింగల్‌ విండో పద్ధతిలో.. దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లో అన్ని రకాల అనుమతులు ఇస్తామని వివరించారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

కొన్ని భారీ ప్రాజెక్టుల విషయంలో మాత్రం కొంత పరిశీలించి అనుమతులు ఇస్తామని చెప్పారు. ప్రతి అనుమతి కోసం తన వద్దకు రావాల్సిన అవసరం లేదని ఉన్నతాధికారి వద్దకు వెళితే చాలన్నారు. ప్రస్తుతం ఏడు శాతంగా ఉన్న వృద్ధిరేటును వచ్చే ఏడాది రెండంకెలకు తీసుకెళతామన్నారు. సింగపూర్‌లో మొత్తం జనాభా 38 లక్షలు ఉంటే ఒక్క హైదరాబాద్‌లోని సైబరాబాద్‌ పరిధిలో 3.8 లక్షల మంది ఐటి నిపుణులు పని చేస్తున్నారన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

తన హయాంలో సైబరాబాద్‌ను అభివృద్ధి చేయడం వల్లే ఐటి రంగం ఇంతగా అభివృద్ధి చెందిందన్నారు. రాజధాని నిర్మాణాన్ని సింగపూర్‌ ప్రభుత్వం చేపట్టడం లేదని.. ిపీపీపీ పద్ధతిన ఓ ప్రైవేటు సంస్థకు ఇస్తున్నామని తెలిపారు. వాస్తు విషయంలో పరిమితిలోబడే ఉంటానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. రాజధాని నిర్మాణాన్ని ఆకట్టుకునే విధంగా పూర్తి చేస్తారన్న నమ్మకముందన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

రాజధాని నిర్మాణం చేపట్టాలనుకున్న తుళ్లూరు ప్రాంతంలోని రైతులు తమ భూములను స్వచ్ఛందంగా ఇచ్చారని తెలిపారు. ఇప్పటికి 25 వేల ఎకరాలు సమీకరించామని చెప్పారు. భూ సమీకరణకు ఈ నెల 28 వరకే గడువు ఉందని ఆ తర్వాత భూసేకరణకు వెళతామని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఎలా రాబట్టాలనే దానిపై తర్వాత చూస్తామని ప్రస్తుతం రాజధాని నిర్మాణంపై ప్రణాళికలను రూపొందించే దశలోనే ఉన్నామన్నారు.

 ఏపీ రాజధాని

ఏపీ రాజధాని

కోర్‌ కేపిటల్‌కు అవసరమైన మాస్టర్‌ ప్లాన్‌ను సింగపూర్‌ సిద్ధం చేస్తుందని చెప్పారు. రాజధాని కోసం ఎంత భూమి సేకరిస్తారన్న ప్రశ్నపై స్పందిస్తూ ఎంత అవసరమైతే అంత తీసుకుంటామని అన్నారు. ఎంత కావాలనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. అభివృద్ధి చేశాక ఎంత అవసరమనేది లెక్కలు వేస్తామన్నారు. రైతుల భూమి 35 వేల ఎకరాలని మిగతా ప్రభుత్వానిదన్నారు. మొత్తం కలిపి 50 వేల ఎకరాల వరకూ అవసరం ఉంటుందన్న అంచనా ఉందన్నారు.

బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)

బాబు స్పీడ్, ఏపీకి సింగపూర్ మార్కెటింగ్ (పిక్చర్స్)

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కే షణ్ముగం, ఏపీ మంత్రులు నారాయణ, కామినేని శ్రీనివాస్ తదితరులు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.

English summary
Singapore Minister Shanmugam Met with AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X