వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘పవన్ మీరు వస్తేనే! బీజేపీకి వెంకయ్య బలి, నెక్ట్స్ బాబు, జగన్‌కు హెచ్చరిక’(వీడియో)

సినీ నటుడు శివాజీ మరోసారి ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘బాబూ ఇకనైనా మారండి’ అనే శీర్షికతో ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు.

|
Google Oneindia TeluguNews

అమరావతి: సినీ నటుడు శివాజీ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'బాబూ ఇకనైనా మారండి' అనే శీర్షికతో ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ఆయన మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా ఏపీకి అన్యాయం జరుగుతూనే ఉందని, నాలుగో సంవత్సరం కూడా కొనసాగుతోందని శివాజీ చెప్పారు.

పోర్లుదండాలు పెట్టినా..

పోర్లుదండాలు పెట్టినా..

అమరావతి నుంచి ఢిల్లీ దాకా పోర్లుదండాలు పెట్టినా.. మీకు కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదని చంద్రబాబునుద్దేశించి అన్నారు. ఢిల్లీ వీధుల్లో చేతులెత్తి మొక్కినా పావలా కూడా ఇవ్వరని చెప్పారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఢిల్లీని తలదన్నే రాజధానిని ఇస్తానన్న ప్రధానమంత్రి.. చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజున రాజధానికి గుప్పెడు మట్టి, చెంబడు నీళ్లు ఇచ్చారని అన్నారు. ఇవి తప్ప ఏమీ ఇవ్వలేదని అన్నారు.

స్వప్రయోజనాల కోసం బాబు..

స్వప్రయోజనాల కోసం బాబు..

ప్రత్యేక హోదా అనేది మన హక్కు అని.. భావితరాల జన్మ హక్కు అని శివాజీ అన్నారు. దాన్ని చంద్రబాబు ప్యాకేజీతో ముడిపెట్టి, సరిపెట్టాలనుకున్నారని తెలిపారు. ప్యాకేజీ అనేది కేవలం డ్రామా అని అన్నారు. చంద్రబాబు స్వప్రయోజనాల కోసం ప్యాకేజీకి అంగీకరించారని ఆరోపించారు.

వెంకయ్య వల్లే..

వెంకయ్య వల్లే..

ఇంతకుముందు కేంద్రమంత్రిగా ఉండి ఇప్పుడు మరో పెద్ద పదవికి పోతున్న ఓ పెద్ద మనిషి కేవలం నరేంద్ర మోడీ ప్రాపకం, తన యొక్క బాగు గురించి మాత్ర ఆలోచించారని వెంకయ్యనాయుడును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయనే చంద్రబాబును ప్యాకేజీకి ఒప్పించారని అన్నారు.

ఇప్పుడేమో తాటతీస్తారట

ఇప్పుడేమో తాటతీస్తారట

మీరు మీకున్న టెన్షన్లతోటి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని చంద్రబాబును దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చినా.. రాకపోయినా తనకనవసరం అనుకున్నారని మండిపడ్డారు. ప్యాకేజీతో ఈ సమయం గడిచిపోతే చాలనుకున్నారని అన్నారు. మూడు సంవత్సరాలు మేసినంత మేయనిచ్చారని.. నాలుగో సంవత్సరం వచ్చేసరికి తాటతీస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. అది చంద్రబాబు విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు.

పుట్టగతులు లేకుండా చేస్తారు..

పుట్టగతులు లేకుండా చేస్తారు..

మీరు తాటలు తీస్తారో.. లేక ప్రజలే మీ అందరి పుట్టగతులు లేకుండా చేస్తారో ఒక ఏడాదిలో తేలిపోతుందని శివాజీ అన్నారు. రాష్ట్రం విడగొట్టి కాంగ్రెస్ ఎంత పెద్ద అన్యాయం చేసిందో.. దానికంటే చంద్రబాబు చేసిన అన్యాయమే పెద్దదని అన్నారు. కేంద్రం నుంచి నిధులు రావని తెలిసినా స్వప్రయోజనాల కోసం హైదరాబాద్‌ను వదిలేసి ఏపికి వెళ్లారని అన్నారు. మీడియా కాన్ఫరెన్సులు, పేపర్లలో ఇదిగో రాజధాని అంటూ చెబుతున్నారని అన్నారు. చంద్రబాబుకు అనుకూలమైన పత్రికల్లోనే కేంద్రమంత్రులను వరుస పెట్టి కలుస్తున్నారని, ఎవర్నీ కలిసినా ఏ ప్రయోజనం ఉండదని అన్నారు. స్వప్రయోజనాలను ఆశించి నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ చేయాలని హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కోరుతున్నారని అన్నారు.

బాబు పతనమే ప్రధాని ధ్యేయం..

బాబు పతనమే ప్రధాని ధ్యేయం..

ఎంతమందినడగినా ఒకటే సమాధానం.. చంద్రబాబు రాజకీయ పతనమే.. ప్రధాని ధ్యేయమని శివాజీ చెప్పుకొచ్చారు. అంతేగాక, అది కూడా తొందర్లోనే జరుగుతుందని అన్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తుకుంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా ఈ రాష్ట్రంలో ఒక్క ఓటు కూడా వేయరని చెప్పారు. బీజేపీ ఏపీకి చేసిన అన్యాయాన్ని ప్రపంచంలో ఉన్న ఏ తెలుగవాడు కూడా మర్చిపోడని అన్నారు.

నమ్మి అధికారం కట్టబెడితే..

నమ్మి అధికారం కట్టబెడితే..

ప్రత్యేక హోదా అనే వరాన్ని తాకట్టు పెడితో ప్రజలు మిమ్మల్ని క్షమించరని చంద్రబాబునుద్దేశించి అన్నారు. రూ.20వేల కోట్లను రెండేళ్లలో ఇస్తామంటే మీరు నమ్ముతారా? అని ప్రశ్నించారు. విదేశీ నిధుల కోసం అర్రులు చాస్తున్నారని అన్నారు. ప్రత్యేక హోదా రాకుంటే రాజధాని నిర్మాణం జరగదని, కానీ, నాయకుడు మాత్రం బాగుపడతాడని అన్నారు. ఈ ప్రభుత్వాల వల్ల ఏమీ జరగడం లేదని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అన్యాయం భావితరాలు మాత్రం మర్చిపోవని అన్నారు. మీరు ఒకప్పుడు అభివృద్ధి బాగా చేశారని నమ్మి.. మీకు అధికారం కట్టబెట్టామని అన్నారు. అయితే, చంద్రబాబు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక హోదా ఉద్యమం చేయాలని అన్నారు.

జగన్‌కు హెచ్చరిక

మీరు మీ వైఖరిని మార్చుకోండి.. కేంద్రం నుంచి బయటికి రండి అని చంద్రబాబుకు పిలుపునిచ్చారు శివాజీ. బీజేపీని నమ్మవద్దని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కూడా సూచించారు. బీజేపీని నమ్మితే బలికావాల్సిందేనని హెచ్చరించారు. ఇప్పుడు వెంకయ్యనాయుడు బలయ్యారు.. ఆ తర్వాత ఏపీ బలవుతుంది.. అనంతరం బలిపీఠం ఎక్కేది చంద్రబాబేనని శివాజీ అన్నారు.

పవన్ ప్రజల్లోకి రావాలి...

పవన్ ప్రజల్లోకి రావాలి...

అంతేగాక, ఈ సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌కు శివాజీ పిలుపునిచ్చారు. హోదాపై పవన్ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. పవన్.. ప్రజల్లోకి వచ్చి పది రోజులు ఉద్యమం చేస్తే ప్రత్యేక హోదా వచ్చేస్తోందని శివాజీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదానే ప్రధాన అంశమవుతుందని అన్నారు. ఎవరైతే హోదాకు వ్యతిరేకంగా వ్యవహరించారో వారికి ప్రజలు సమాధి కడతారని శివాజీ అన్నారు.

English summary
Cine hero Sivaji on Wednesday issued a warning to Andhra Pradesh CM Chandrababu Naidu and YS Jaganmohan Reddy on BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X