విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రివర్స్: ఫైనాన్షియర్ ను కిడ్నాప్ చేసి చితక్కొట్టిన డాక్టర్లు

ఫైనాన్షియర్లు తమకు రావాల్సిన డబ్బులకు కోసం కిడ్నాప్ చేయడం చూస్తుంటాం. వాటి గురించి వినే ఉంటాం. కాని, విజయవాడలో దానికి భిన్నంగా జరిగింది. నగరానికి చెందిన కొందరు డాక్టర్లు ఏకంగా ఓ ఫైనాన్షియర్ ను కిడ్నాప

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ:ఫైనాన్షియర్లు తమకు రావాల్సిన డబ్బులకు కోసం కిడ్నాప్ చేయడం చూస్తుంటాం. వాటి గురించి వినే ఉంటాం. కాని, విజయవాడలో దానికి భిన్నంగా జరిగింది. నగరానికి చెందిన కొందరు డాక్టర్లు ఏకంగా ఓ ఫైనాన్షియర్ ను కిడ్నాప్ చేసి చితక్కొట్టారు. ఈ ఘటనపై నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశాడు బాధితుడు.

విజయవాడ నగరానికి చెందిన బ్రహ్మాజీ అనే వడ్డీ వ్యాపారిని కొందరు వైద్యులు కిడ్నాప్ చేసి చితకబాదారు.అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రీ ఎండీ సహా ఆరుగురు పేరొందిన వైద్యులు ఈ దారుణానికి పాల్పడ్డారని భాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

kidnap

బాధితుడిని నగరశివారులోని ఓ మామిడితోటలోకి తీసుకెళ్ళి అక్కడ చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు.అయితే అక్కడి నుండి తప్పించుకొన్న బాధితుడు పటమట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. తనపై దాడి చేసిన వైద్యులపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఆయన పోలీసులను కోరారు.

అయితే కేసు నమోదు చేయకుండా పటమట సీఐ కెనెడీ జాప్యం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.కొందరు రాజకీయనాయకులు రంగంలోకి దిగి సెటిల్ మెంట్లు చేసేందుకు యత్నించగా, అందుకు సీఐ సహకరించినట్టు సమాచారం.

అయితే ఈ విషయమై బాధితుడు నగర పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ కు పిర్యాదుచేశాడు. ఆలస్యంగా కేసు నమోదు చేయడం సహా దాడికి పాల్పడినవారికి పోలీసులు రక్షణ కల్పించిన విషయమై బాధితుడు సవాంగ్ కు వివరించాడు. అయితే ఈ ఘటనను సీరియస్ గా తీసుకొన్న సీపీ సమగ్రవిచారణకు ఆదేశించారు. సీఐ కెనడీని వీఆర్ కు పంపారు. సెంట్రల్ ఏసీపీ సత్యానందంపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.

English summary
Six members of doctors team kidnapped financier in Vijayawada.they were attacked on him, he was complaint against doctors to CP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X