వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పైరసీ కేసు: మంత్రి నారాయణపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ సమర్పించారంటూ ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పట్నం కమలాకర్ అనే సామాజిక కార్యకర్త బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో ఎలాంటి కేసులు లేవని నారాయణ అఫిడవిట్ దాఖలు చేశారని, అయితే ఆయనపై నారాయణగూడ పోలీస్‌స్టేషన్‌లో కాపీ రైట్ యాక్ట్ కింద పైరసీ కేసు నమోదై ఉందంటూ, అందుకు సంబంధించిన ఆధారాలను అందజేశారు.

Social worker complains against Narayana

పులిచింతలను సందర్శించిన సింగపూర్ బృందం

అదలావుంటే, కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును బుధవారం సింగపూర్‌కు చెందిన తుబాణా కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. రాజధానికి నీటి అవసరాలకు ఎలా తీర్చాలనే దానిపై 12 మంది కంపెనీ ప్రతినిధులు ప్రాజెక్టును సందర్శించి అధికారులతో మాట్లాడారు.

బృంద ప్రతినిధి వాంకీయంగ్‌ పులిచింతల ప్రాజెక్టు ఇంజనీర్లతో చర్చించి ప్రాజెక్టుకు నీటి లభ్యత, ఎన్ని నీళ్లు ఆపుతారు, ఎన్ని నీళ్లు వృధాగా పోతున్నాయి తదితర వివరాలు తెలుసుకున్నారు. ఏటా సగటు వర్షపాతం ఎంత ఉంటుందనే వివరాలను సేకరించారు.

ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ నదిపై ఎంత నీరు ప్రజలు వారి అవసరాలకు వాడు కుం టున్నారు? రాజధాని నీటి అవసరాలు అధిగమించాలంటే కృష్ణానదిపై రిజర్వాయర్లు ఎక్కడ నిర్మించాలనే దానిపై కంపెనీ ప్రతినిధులు అధ్యయనం చేస్తారు.

English summary
Social worker Patnam kamalakar has complained against Andhra Pradesh minister Narayana to the Election commissioner Bhanwarlal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X