వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'బిజెపి'తో జగన్‌ను ఇరుకున పెట్టేందుకు టిడిపి, జగన్ 'రెడ్డి', రోజా 'రెడ్డి'.. అంతా వాళ్లే

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు వేణు మాధవ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

|
Google Oneindia TeluguNews

నంద్యాల: నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నటుడు వేణు మాధవ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వైసిపి బెదిరింపులకు దిగుతోందని ఆరోపించారు. విదేశాల నుంచి జగన్ మనుషులు ఫోన్‌లు చేసి బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

దమ్ముంటే నేరుగా రండి

దమ్ముంటే నేరుగా రండి

జగన్ మనుషులకు దమ్ముంటే నేరుగా వచ్చి మాట్లాడాలని సోమిరెడ్డి సవాల్ విసిరారు. బిజెపితో పొత్తు పెట్టుకున్నామని గతంలో తమను విమర్శించారని, ఇప్పుడు వైసిపి వైఖరి ఏమిటో నంద్యాల ప్రజలకు చెప్పాలని సోమిరెడ్డి ప్రశ్నించారు. మైనార్టీలను జగన్ మభ్య పెడుతున్నారన్నారు.

Recommended Video

Nandyal By polls : Chandrabab Naidu Vs YS Jagan, What You Need to Know
జగన్‌ను ఇరుకున పెట్టే యత్నం

జగన్‌ను ఇరుకున పెట్టే యత్నం

నంద్యాలలో మైనార్టీల ఓట్లు చాలా కీలకం. అందుకే టిడిపి ప్రచారానికి బిజెపిని దూరం ఉంచిందని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో ఎక్కడా బిజెపి పేరు వినిపించడం లేదు. ఇప్పుడు సోమిరెడ్డి వైసిపిని టార్గెట్ చేశారు. బిజెపితో పొత్తుపై తమను వైసిపి ప్రశ్నించిందని, ఇటీవల వైసిపి బిజెపికి దగ్గరవుతోందని, దీనిపై సమాధానం చెప్పాలని జగన్‌ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు.

వైసిపిలో రెడ్డిలదే హవా: జవహర్

వైసిపిలో రెడ్డిలదే హవా: జవహర్

టిడిపిలో డజన్ల కొద్ది దళిత నేతలు పదవుల్లో ఉన్నారని, వైసిపిలో దళిత నేత ఒక్కరి పేరు చెప్పగలరా అని మంత్రి జవహర్ ప్రశ్నించారు. జగన్ రెడ్డి, రోజా రెడ్డి, విజయ సాయి రెడ్డి, చెవిరెడ్డి.. ఇలా అంతా వాళ్లదే పెత్తనం అన్నారు. దళితులకు న్యాయం చేసే పార్టీ టిడిపి మాత్రమే అన్నారు.

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు

జగన్‌పై ఈసీకి ఫిర్యాదు

నంద్యాల ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబుపై జగన్‌ చేసిన వ్యాఖ్యలపై టిడిపి కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆ పార్టీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, నిమ్మల కిష్టప్ప, శ్రీరామ్‌ మాల్యాద్రి సీఈసీని కలిసి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు.

సాక్షి ఆర్టికల్ పెయిడ్ న్యూస్‌గా

సాక్షి ఆర్టికల్ పెయిడ్ న్యూస్‌గా

ముఖ్యమంత్రిని నడిరోడ్డుపై కాల్చి చంపాలని జగన్‌ వ్యాఖ్యానించడం, జడ్‌ కేటగిరీ ఉన్న వ్యక్తికి సంబంధించిన వాహనాన్ని అడ్డుకోవడంపై సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. సాక్షి పత్రికలో వచ్చే పెయిడ్‌ న్యూస్‌ను ఎన్నికల ఖర్చుకిందే లెక్కగట్టాలని ఈసీని కోరినట్లు తెలిపారు. వైసిపి నేతల ఫిర్యాదుపై వెంటనే స్పందిస్తున్నారని, టిడిపి నేతల ఫిర్యాదుపై మాత్రం స్పందించడం లేదని ఈసీకి చెప్పినట్లు తెలిపారు.

English summary
Minister Somireddy Chandramohan Reddy on Monday irked YSR Congress Party with BJP alliance comments.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X