వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏం కనిపించడంలేదా: పవన్ కళ్యాణ్‌పై సోమిరెడ్డి నిప్పులు, నిమ్మల చురక

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోయేకాలం వచ్చిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంగళవారం మండిపడ్డారు. అలాగే, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పుండుమీద కారం చల్లవద్దన్నారు.

హైదరాబాదులో సీమాంధ్రు ప్రజల పైన పవన్ కళ్యాణ్‌కు వివక్ష కనిపించడం లేదా అని సోమిరెడ్డి అన్నారు. ఏపీ ప్రజల హృదయాలు గాయపడుతుంటే పవన్ పుండు మీద కారం చల్లినట్లు మాట్లాడుతున్నారన్నారు. సెక్షన్ 8 అవసరం లేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు.

రాజ్యాంగ అధినేతలకు వంగి దండాలు పెట్టడం కాదని, రాజ్యాంగాన్ని గౌరవించడం కెసిఆర్ నేర్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న పాలన జరగడం లేదన్నారు. ఆయన సభల్లో ఎవరినైనా ప్రశ్నిస్తే.. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చేస్తోందన్నారు. కెసిఆర్ పద్ధతులు మార్చుకోవాలన్నారు.

దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు తెలుగుదేశం పార్టీ ఒక్కటే అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ పాలనలో ఎంత అభివృద్ధి జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసునని చెప్పారు. న్యాయస్థానాలు చెప్పినా రిలీవ్ చేసిన ఉద్యోగులను తీసుకోలేదన్నారు.

Somireddy on KCR, Nimmala on Pawan Kalyan

వారి అడ్వోకేట్ జనరల్ న్యాయస్థానాల పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారన్నారు. కోర్టు తీర్పులనే పట్టించుకోవడం లేదన్నారు. మీకు పోయే కాలం వచ్చిందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. హైదరాబాద్ పైన ఏపీ, తెలంగాణవారికే కాదని, భారతీయులకు హక్కుందని చెప్పారు.

పదవి ఉండి జ్ఞానం లేని మూర్ఖులు టీఆర్ఎస్ నేతలది అన్నారు. తెలంగాణలో ప్రజలకు నిరసన తెలిపే హక్కు లేదా అన్నారు. ఆంధ్ర, రాయలసీమకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తుంటే వైసీపీ అధ్యక్షులు జగన్ ఎందుకు స్పందించడం లేదన్నారు.

ఆంధ్రా, రాయలసీమకు శత్రువుగా మారిన కెసిఆర్‌తో జగన్ చేయి కలిపారన్నారు. దీనిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నీకు నీవే నీ పార్టీని ఏపీలో చంపేసుకుంటానంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సోమిరెడ్డి చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడ్డారన్నారు.

పవన్ వ్యాఖ్యలపై నిమ్మల కిష్టప్ప

ప్రత్యేక హోదా విషయంలో పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని నిమ్మల కిష్టప్ప అనంతపురం జిల్లాలో అన్నారు. కానీ ప్రజాస్వామ్యంలో అదనపు బాధ్యతలు ఉంటాయని చెప్పారు. తనకు వ్యవసాయం తప్ప ఎలాంటి వ్యాపారం లేదన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలతో ప్రత్యేక హోదా రాదన్నారు. సెక్షన్ 8 హైదరాబాదులో అమలవుతుందని చెప్పారు.

English summary
Somireddy Chandramohan Reddy on KCR, Nimmala Kistappa on Pawan Kalyan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X