వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీ ఇష్టం: జగన్ పార్టీది చెల్లదని సోమిరెడ్డి, అప్పటికి...

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Somireddy says on YSRCP whip
హైదరాబాద్: జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు, కార్పోరేషన్ల మేయర్ల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విప్ చెల్లదని మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోమవారం అన్నారు. గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే విప్ జారీ చేసే హక్కు ఉంటుందన్నారు.

ఇటీవలే వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఈసీ గుర్తింపు వచ్చిన నేపథ్యంలో సోమిరెడ్డి మాట్లాడుతూ... ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పోరేటర్ల ఎన్నకిలు జరిగే నాటికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపు పొందిన పార్టీ కాదని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీకి విప్ జారీ చేసే హక్కు లేదన్నారు.

ఒకవేళ ఆ పార్టీ విప్ జారీ చేసినప్పటికీ పార్టీ తరఫున ఎన్నికైన సభ్యులెవరికీ అది వర్తించదన్నారు. ఆ విప్‌ను ఉల్లంఘించినప్పటికీ సభ్యుల పైన పార్టీ ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు పడదన్నారు. విప్‌ను పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు స్వేచ్ఛగా తమకు నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయవచ్చునని చెప్పారు. ఇందుకు సంబంధించి గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పు కూడా ఉందన్నారు.

విప్ కచ్చితంగా చెల్లుతుంది: సోమిరెడ్డి

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇచ్చిన విప్ కచ్చితంగా చెల్లుబాటు అవుతుందని ఆ పార్టీ నేత మైసూరా రెడ్డి చెప్పారు. సోమిరెడ్డి వ్యాఖ్యల పైన పైవిధంగా మైసూరా రెడ్డి స్పందించారు. తమ పార్టీ గుర్తింపు పొందిన పార్టీ అని, ఈసీ జిల్లా కలెక్టర్లకు సమాచారం పంపించిందన్నారు. తాము విప్ జారీ చేయవచ్చునని, అది చెల్లుతుందన్నారు.

English summary
YSR Congress party leader MV Mysura Reddy fired at Telugudesam party leaders for encouraging jumpings
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X