వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గౌతమి హత్య కేసులో కీలక మలుపు: టీడీపీ నేతతో పెళ్లి ఫొటోలు వెలుగులోకి

ఐదు రోజుల క్రితం పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై చోటు చేసుకున్న మిస్టరీ ఇంకా వీడలేదు.

|
Google Oneindia TeluguNews

పశ్చిమగోదావరి: ఐదు రోజుల క్రితం పాలకొల్లు మండలం దిగమర్రులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై చోటు చేసుకున్న మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే ఇది రోడ్డు ప్రమాదం కాదని, హత్యేనని స్పష్టమవుతోంది. ఈ సంఘటనలో నరసాపురానికి చెందిన యువతి దంగేటి గౌతమి మృతి చెందగా.. ఆమె చెల్లెలు పావని తీవ్రగాయాలకు గురైన విషయం తెలిసిందే.

<strong>ప్రమాదం కాదు, గౌతమిని వెంటాడి చంపారు!: టీడీపీ నేత మొదటి భార్య పనే?</strong>ప్రమాదం కాదు, గౌతమిని వెంటాడి చంపారు!: టీడీపీ నేత మొదటి భార్య పనే?

పాలకొల్లు గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మొదటినుంచి భిన్నాభిప్రాయాలే వినిపిస్తున్నాయి. పోలీసులు ప్రమాద ఘటనగా కేసు నమోదు చేసి ఆ దిశగా దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, తమను నలుగురైదుగురు కారులో వెంబడించి మరీ ఢీకొట్టారని శ్రీగౌతమి సోదరి పావని చెబుతోంది.

హత్య చేయించారు..

హత్య చేయించారు..

టీడీపీ నేత సజ్జా బుజ్జి భార్య శిరీష, ఆమె కారు డ్రైవర్‌ రాంబాబు కలసి హత్య చేయించారని రోదిస్తోంది. ఈ ఘటన నేపథ్యంలో శ్రీగౌతమి, బుజ్జి రహస్య వివాహానికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. 2016 జనవరిలో బుజ్జి అన్నవరంలో శ్రీగౌతమిని వివాహం చేసుకున్నాడు. అయినా పోలీసులు మాత్రం మీన మేషాలు లెక్కిస్తున్నారని కుటుంబసభ్యులు మండిపడుతున్నారు.

రాజీ యత్నాలు షురూ..

రాజీ యత్నాలు షురూ..

సజ్జా బుజ్జి టీడీపీకి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తుంటాడనే వాదనలు స్థానికంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాలకొల్లు ఎమ్మెల్యే కేసును పక్కదోవ పట్టించడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని మరో టీడీపీ ఎమ్మెల్యే సైతం కేసును నీరుగార్చేందుకు రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నారని చెబుతున్నారు.

అజ్ఞాతంలోకి..

అజ్ఞాతంలోకి..

ఇది ఇలా ఉండగా, ఈ కేసుతో సంబంధం ఉన్న సజ్జా బుజ్జి, అతని భార్యను శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా నాయకులు నరసాపురం అంబేడ్కర్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహిం చారు. కాపు సంఘం ముఖ్య నేతలు సమావేశమై ఘటనను ఖండించారు. ఈ క్రమంలో బుజ్జి కుటుంబీకులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలిసింది.

పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌?

పోలీసుల అదుపులో కారు డ్రైవర్‌?

కేసు పురోగతిపై పాలకొల్లు సీఐ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా.. కారు డ్రైవర్‌ కడియాల ప్రసాద్‌ (24)తోపాటు కారు యజమానిపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు. కాగా సోమవారం ఉదయం వైజాగ్‌ నుంచి కారు డ్రైవర్‌ను తీసుకువచ్చి ఎస్పీ వద్దకు తీసుకు వెళ్లినట్టు సమాచారం.

English summary
It is said that Sri Guatami, who was allegedly killed in a accident, and Bujji marriage photo revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X