వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొలిటికల్ పంచ్... ట్విస్ట్: ప్రశాంత్ కిషోర్ సూచన జగన్‌ని దెబ్బతీసిందా?

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకొని బోర్లా పడ్డారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

|
Google Oneindia TeluguNews

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను నమ్ముకొని బోర్లా పడ్డారా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి.

గత కొద్ది రోజులుగా పొలిటికల్ పంచ్ పేరు బాగా వినిపిస్తోంది. ఏపీలో అధికార పార్టీ పైన, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పైన సెటైర్లు వేసింది.

అయితే, మండలి పైన అనుచిత కార్టూన్ వేయడంతో దాని నిర్వాహకుడు రవికిరణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేయడం, తాజాగా విచారణ జరుపుతుండంతో పొలిటికల్ పంచ్ వెలుగులోకి వచ్చింది.

పొలిటికల్ పంచ్

పొలిటికల్ పంచ్

ఇందులో పని చేసే వారికి సాక్షి నుంచి వేతనాలు వస్తున్నాయని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2014 ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు, బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ గెలుపుకు ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త పని చేశారు.

2019లో వైసిపి కోసం..

2019లో వైసిపి కోసం..

ఆయన ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటారని అంటారు. 2019లో వైసిపిని గెలిపించేందుకు ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీ కోసం పని చేస్తున్నారనే ప్రచారం కూడా ఇటీవల సాగుతోంది. సుమారు రూ.250కోట్లు వెచ్చించి మరీ జగన్.. ప్రశాంత్ కిషోర్ సేవలు వినియోగించనున్నట్లు ప్రచారం సాగుతోంది.

సోషల్ మీడియానే ప్రశాంత్ కిషోర్ అస్త్రం

సోషల్ మీడియానే ప్రశాంత్ కిషోర్ అస్త్రం

ఇందుకోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారని అంటున్నారు. ఇటీవల వైసిపి నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇవన్నీ పక్కన పెడితే.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని, ఎన్నికల్లో గెలుపుకు ఆదే దోహదం చేస్తుందని వైసిపి వర్గాలకు కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లుగా తెలుస్తోంది.

ఆయన వ్యూహంలో భాగంగానే..!

ఆయన వ్యూహంలో భాగంగానే..!

పొలిటికల్ పంచ్ కాంట్రోవర్సీ నేపథ్యంలో.. ఇటీవలి పోస్టుల వ్యవహారాలన్నీ ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన సలహాల్లో భాగమేననే ప్రచారం సాగుతోంది. పొలిటికల్ పంచ్ పోస్టుల వెనుక ప్రశాంత్ కిషోర్ ఉన్నారన్నది నిజమే అయితే అతను చాలాకాలంగా వైసిపి కోసం అన్ అఫిషియల్‌గా పని చేస్తున్నట్లే అంటున్నారు.

సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం, దానిని ప్రభుత్వాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని వైసిపి వర్గాలు ఎదురు దాడి చేయడం వెనుక కూడా ప్రశాంత్ కిషోర్ సూచనలుగా చెప్పుకుంటున్నారని అంటున్నారు.

English summary
Strategist advice: shock to YS Jagan?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X